కృత్రిమ ఇసుక కొరతను నిరసిస్తూ, ఇసుకను తక్షణం అందుబాటులో తీసుకువచ్చి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని డిమాండ్ తో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన ఇంటి వద్ద కొనసాగిస్తున్న 36గంటల నిరవధిక దీక్ష నేడు రెండో రోజుకు చేరింది. రెండవ రోజైన శనివారం దీక్షను నిరాటంకంగా ఆయన కొనసాగిస్తున్నారు. రవీంద్ర దీక్షకు భవన నిర్మాణ కార్మికులు మద్దతు తెలిపారు. ఇది ఇలా ఉంటే నేటి మధ్యాహ్నం మచిలీపట్నంలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్నది.దీనికి జిల్లాలోని 16 నియోజకవర్గాల ముఖ్యనేతలు హాజరవుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్, పార్టీ రాష్ట్ర కమిటి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావులను జిల్లా సమన్వయ కమిటీ మచిలీ పట్నానికి ఆహ్వానించింది. సమావేశానంతరం దీక్షా శిబిరాన్ని సందర్శించి రవీంద్ర దీక్షను నేతలు విరమింప చేస్తారు.