కేసీఆర్ …రాజకీయ యుద్ధ వ్యూహ చతురతకు పెట్టింది పేరు. స్టేజ్ రాజకీయాల్లోనైనా, ఫీల్డ్ లోనైనా ఆయనకు సాటి రారెవ్వరు. పంచ్ డైలాగులు బ్రాండ్ అంబాసిడర్ కెసిఆర్.
తెలంగాణ సాధించి 2సార్లు సీఎం అయిన వ్యక్తి. ఎదురే లేదన్న రీతిలో కాలం గడుస్తున్న వేళ ధిక్కార స్వరం వినిపించింది. టీఆరెస్ శిబిరంలో కలవరం రేగింది. కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎందుకిలా?
గడిచిన 6ఏళ్లలో తెలంగాణలో కేసీఆర్ ఆడిందే ఆట, పాడిదే పాట. ప్రజాస్వామ్య0 కంటే కేసీఆర్ స్వామ్యం నడిచింది. జనాలు గులాబీ దళపతి కి దన్నుగా నిలిచారు. ప్రశ్నించే గొంతుకలు మాయమై పోయాయి. కానీ ఇపుడు చిన్న ఉద్యోగులైన ఆర్టీసీ వర్కర్లు సమ్మెకు దిగారు. వారిని చీమలా నలిపేస్తా అనుకున్నారు కేసీఆర్. వాళ్ళు భయపడలేదు. ధిక్కార స్వరం పెంచారు. అరేళ్లలో ఇంతటి ధిక్కారాన్ని చవి చూడని ముఖ్యమంత్రి అసహనంతో రగిలిపోయారు. ఒక్క వేటుతో 48వేల మంది ఉద్యోగాలు ఖతం చేస్తా అని బెదిరింపులకు దిగారు.
ఆర్టీసీలో కొత్త కొలువులు నింపుతా అన్నారు. యూనియన్ లో చేరబోము అని రాసిస్తేనే కొలువు అన్నారు. ఆర్టీసీ కార్మిక నేతలు అత్యుత్సాహంతో సమ్మెకు దిగినట్లు ని0దించారు.
ఇక ఒకవైపు సమ్మె జరుగుతుండగానే మరో వైపు ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతి భవన్ పిలుచుకుని విందు భోజనం చేశారు. శభాష్ అని వారిని మెచ్చుకున్నారు. కానుకాలు ఇస్తా అన్నారు. మరి ఆర్టీసీ కార్మికుల మీద ఉక్కుపాదం ఎందుకు? ఉద్యోగ సంఘాల మీద ప్రేమ ఎందుకో జనాలకు అంతుచిక్కడం లేదు.
అప్పుడు సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటే పొగిడి ఇప్పుడు తిట్టుడేంది?
43 శాతం ఫిట్ మెంట్ అడిగితే 44 శాతం ఎందుకు ఇచ్చినట్లు?
ఆర్టీసీలో యూనియన్ లు వొద్దన్న మనిషి ఉద్యోగ యూనియన్ లీడర్లకు విందు భోజనం పెట్టి దువ్వుదేంది?
Something went wrong ఏదో తేడా కొడుతున్నది… మతలబు ఏందో కానీ కేసీఆర్ తొవ్వ ఎటు పోతున్నట్లో???