అనంతపురం జిల్లాలో నెల రోజులుగా కురుసున్న వర్షాల వల్ల కొద్ది కోట గోడ దెబ్బతినిందని అ గుత్తి కోట సంరక్షణ అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుత్తికోట హైదరాబాద్ బెంగుళూర్ జాతీయ రహదారి మీద డోన్ పట్టణం దాటాక వస్తుంది. కోట చాలా దూరాన్నుంచే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రాయలసీమలో బాగా నిర్లక్ష్యానికి గురవుతున్న చారిత్రక నిర్మాణాలలో గుత్తి కోట ఒకటి. ఏమాత్రం సంరక్షణ లేని చారిత్రక సంపద గుత్తి కోట. మన ప్రభుత్వాలు చారిత్రక సంపదను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారనేందుకు గుత్తి కోట్ల ఒక ఉదాహరణ.
ఇపుడు వర్షాల వల్ల దెబ్బతిన్న కోట గోడను అధికారులు వెంటనే మరమ్మతుచేయాలని, లేకపోతే, కోట గోడంతా కూలిపోతుందని ఆయనచెబుతున్నారు.
ఒక జాతికి చరిత్రయే స్ఫూర్తినిచ్చేది. గతమే ప్రజలను ముందుకు నడిపిస్తూఉంటుంది. అందుకే గతకాలపు జ్ఞాపకాలైన కోటలవంటి నిర్మాణాలను కాపాడుకోవాలని చెబుతున్నారు విజయభాష్కర్. భాస్కర్ కృషి ఫలిస్తుందని ఆశిద్దాం. ఆయన ప్రయత్నాలకు మద్దతు నిద్దాం.