అంతరిక్షంలో మొట్టమొదటి సారి మహిళలు స్పేస్ వాక్ చేయబోతున్నారు.
నిజానికిది ఆరునెలల కిందటే జరగాల్సి ఉండింది.అయితే, మహిళలకు అవసరమయిన స్పేస్ సూట్ కొరత రావడంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (NASA) ఈ స్పేస్ వాక్ ను వాయిదా వేసింది.
ఇపుడు స్పేస్ సూట్స్ అందుబాటులోకి రావడంతో అమెరికా ఆస్ట్రొనట్స్ క్రిస్టినా కోక్, జెసికా మీయెర్ లు స్పేస్ వాక్ కు సిద్ధమవుతున్నారు.
కోక్ మార్చినుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. మీయర్ మాత్రం ఈసెప్టెంబర్ లో చేరుకున్నారు.
ఈ అక్టోబర్ 21 మానవ జాతి చరిత్రలో మరొక కొత్త మైలురాయిగా నిలబడబోతున్నది. ఇద్దరు మహిళలు కలసి అంతరిక్షంలోనడవబోతున్నారు.
వీరుఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ISS)నుంచి బయటకు వచ్చి దీనికి విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయిన బ్యాటరీలను బిగిస్తారు.
తొలివిడతలో కోక్, ఏన్ మెక్ క్లెయిన్ తో కలసి గత మార్చిలోనే ఈ పనిచేయాల్సి ఉండింది. అయితే చివరిక్షణంలో స్పేస్ సూట్ కొరత అంటూ నాసా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇపుడు మెక్ క్లెయిన్ భూమికి తిరిగొచ్చారు. అమె కు బదులు మీయర్ వెళ్లారు.
ఐఎస్ ఎస్ లో మొత్తం నాలుగు సూట్లున్నాయి. ఇందులో ఒక చిన్నది,రెండు పెద్దవి, మరొక ఎక్స్ట్రా లార్జ్. ఇపుడు ఇద్దరు మహిళలుండటంతో మరొక చిన్న సూట్ అవసరమయింది. ఇపుడు నాసా పంపించింది ఈ రెండోసూట్ నే.
నాసా దగ్గిర స్త్రీ పురుషులకు విడివిడిగా స్పేస్ సూట్స్ అందుబాటులో లేవు. స్త్రీ లకు కొంచెం చిన్న సైజువి కావాలి. అపుడు ఒకటే అందుబాటులో ఉండింది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్తు సరఫరా అవుతుంది. అయితే, స్పేస్ ల్యాబ్ సూర్యుడి వెలుతరు పడని వైపు ఉన్నపుడు విద్యుత్ సరఫరా ఆగిపోతుంది.
అపుడు బ్యాటరీలు విద్యుత్తును అందిస్తాయి. దీని కోసంబ్యాటరీలను మారుస్తూ ఉండాలి.
ఇప్పటినుంచి అయిదు సార్లు స్పేస్ వాక్ చేసి బ్యాటరీలను బిగిస్తారు. RT రిపోర్టు ప్రకారం మొదటి వాక్ ఈ ఆదివారం ఉంటుంది. అపుడుకోక్ ఒక పురుష కొలీగ్ తో కలసి బ్యాటరీ బిగిస్తారు. అయితే, నాలుగో వాక్ లో మాత్రం ఇద్దరు మహిళలే (పై ఫోటో) ఉంటారు.