కంటికి ఇంపైన పుసుపుపచ్చ రంగుంలో ఉండి, అదే రంగులో ఎంత కాలమయినా ఉండ గలిగే ఏకైక లోహం బంగారు.
ఈ గుణంతోనే బంగారు నగలలో స్థిరపడింది. తప్పు పట్టదు, కాలంతో వన్నెతగ్గదు.సృష్టిలో ఇంతఅందమయిన లోహం మరొకటి లేదనే ఎపుడు మన పూర్వీకులే గుర్తించారు.
బంగారాన్ని ఏ రూపంలోకైనా మలుచుకోవచ్చు. దీని వల్లే ఆభరణాలలో బంగారం బాగా వొదిగి పోతుంది.
ఇది కాక, బంగారానికు మరొక అద్భతమయిన గుణం ఉంది. అది ఉష్ణ వాహకత్వం (Conductivity).
ఈ గుణం వల్ల బంగారు వాడకం పరిశ్రమల్లోకి,ఎలెక్ట్రానిక్స్ లోకి కూడా విస్తరించింది.
మీరిపుడు ఈ వ్యాసం మీ స్మార్ట్ ఫోన్ లో చదువగలుగుతున్నారంటే, ఇందులో బంగారు పాత్ర ఉందంటే చాలా మందికి ఆశ్చర్యం మేస్తుంది, కదూ?.
అవును నిజం, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్స్ లో బంగారు ఉంటుంది. అందుకే పాత కంప్యూటర్ల వేస్టు పెద్దవ్యాపారమయింది. ఇలా ఇ-వేస్టు నుంచి బంగారు తీయడాన్ని బిబిసి అర్బన్ మైనింగ్ అని వర్ణించింది.
పూర్వం బంగారు జరీ అంచు చీరెలొచ్చేవి. ఇపుడుకూడా ఉన్నాయి,కాని బాగా తక్కువ. జరీలో ఉన్న బంగారు వల్లే జరీ అంచు పట్టు చీరెలను పాతవయినా కొంటామని వస్తుంటారు.
వాళ్లు ఈ జరీని రిసైకిల్ చేసి బంగారు వెలికి తీస్తారు. బంగారాన్ని ఎక్కడెక్కడ వాడతారో చూద్దాం.
ఎలెక్ట్రానిక్స్ లో…
కంప్యూటర్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ లలో ఉండే ప్రాసెసర్స్, ఎడ్జ్ కనెక్టర్స్ లో బంగారు వాడతారు.
అంతేకాదు టెలివిజన్స్, గేమింగ్ కన్సోల్స్ , ప్రింటర్స్ లలో… ఇలా చాలా ఎలెక్ట్రానిక్స్ పరికరాలలో గోల్డ్ వాడతారు. ఈ గోల్డ్ ని రివకర్ చేయవచ్చు. ఇందులోనుంచి బంగారు తీయడానికి సైనైడ్ లేదా యాసిడ్స్ వాడతారు. ఈ విధానమంతా ఎన్నిరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదని చెబుతారు.అయితే, ప్రాసెసర్లను కనెక్టర్లను రిసైకిల్ చేసి బంగారు తీస్తున్నారు.
భారతదేశంలొ ఢిల్లీ దీనికి పెద్ద కేంద్రం.
ఎలెక్ట్రానిక్స్ లో బంగారు వాడటానికి కారణం చెక్కుచెదరని బంగారు స్వభావమే. కాపర్, వెండికి కూడా విద్యుత్ వాహకత్వవం ఎక్కువే అయినా అవి రసాయన చర్యలకు లోనవుతాయి.
బంగారు ఇలాంటి చర్యలకు లోను కాదు.
సాలిడ్ స్టేట్ ఎలెక్ట్రానిక్స్ లో చాలా తక్కువ వోల్ట్ లలో విద్యత్తును వాడతారు. కండక్టర్స్ తుప్పు పట్టినా, మసకబారినా విద్యత్సరఫరా అగిపోతుంది.
దానికి తోడు చాలా వేగంగా డిజిటల్ ఇన్ ఫర్మేషన్ ఒక కాంపొనెంట్ నుంచి మరొక కాంపొనెంట్ కు ప్రసారం జరగాలి. దీనికి బంగారు మాత్రమే ధీటయింది.
ఎందుకంటే తుప్పు పట్టకుండా, మసక బారకుండా ఈ మైక్రోవోల్ట్ లలో ఉండే విద్యుత్ సమర్థవంతంగా బంగారం ప్రసారం చేస్తుంది.
అందుకే ఈ పరికరాలలో చాలా తక్కువ మోతాదులోనైనా రాగి, వెండిలకు బదులు, బంగారునే వాడతారు.
ఈ కాంపొనెంట్స్ లో బంగారును ఇతర లోహాల మీద పూతలాగా లేదా నికెల్, కోబాల్ట్ లతో కలిపి గాని బంగారాన్ని వాడతారు.
దంతవైద్యంలో కూడా బంగారు వాడతారు. ఇది చాలా పురాతన వైద్యం. క్రి.పూ 700 కిందటే బంగారాన్ని వాడిన ఆధారాలున్నాయి. పళ్లలో ఉన్న కేవిటీస్ పూరించేందుకు పూర్వం నుంచే బంగారును వాడే వారు. ఆధునిక వైద్యంలో 1970 దాకా బంగారును విస్తృతంగా వాడారు.
ఎరోస్పేస్ లో…
అంతరిక్ష వాహనాలలో లూబ్రికేంట్స్ ను వాడటం, సర్వీసింగ్ చేయడం, మెయింటెనెన్స్ అనేవి ఉండవు. అందువల్ల కొన్ని కీలకమయిన కాంపొనెంట్స్ ను వాడేందుకు విశిష్టమయిన లోహం కావాలి. దానికి బంగారే అనువైనవది. నాసా నిపుణులు స్పేస్ క్రాఫ్ట్స్ లోని సర్క్యూట్స్ లో బంగారు వాడతారు. బంగారు పూత పూసిన పాలిఇస్టర్ ఫిల్మ్ ను ను కూడా అంతరిక్ష నౌకలలో విరివిగా వాడతారు.స్పేస్ క్రాఫ్ట్ మీద కనిపించే నిగనిగా లాడే తగరం లాంటి కోటింగ్ బంగారుదే.
ఈ ఫిల్మ్ ఇన్ ఫ్రారెడ్ కిరణాలను వెనక్కి పంపి స్పేస్ క్రాఫ్ట్ లో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది.
ఇలా లేకపోతే, నల్లగా ఉండే స్పేస్ క్రాఫ్ట్ ఉపరితల భాగాలు, నల్లరంగు పూసిన విడిభాగాలు ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కిపోతాయి.
స్పేస్ షిప్ లో కదిలే విడిభాగాలకు లిక్విడ్ లుబ్రికేంట్స్ వాడరు. దీని స్థానంలో పల్చటి బంగారు పొరని వాడతారు. బంగారు మోలిక్యూల్స్ లూబ్రికేంట్స్ లాగా జారుడు స్వభావం చూపి లూబ్రికేంట్ పనినే సమర్థవంతంగా చేస్తాయి.
గాజు తయారీలో కూడా బంగారు వాడతారు.గోల్డ్ రూబీ కలర్ రావడానికి గాజులో బంగారు కలుపుతారు.