అపుడే మామూలా… నలుగురు గ్రామ వలంటీర్ల సస్పెన్షన్

నెలతిరిగిందో లేదో చేతి వాటం ప్రదర్శించేందుకు పూనుకున్న గ్రామ వలంటీర్లు. పేద వాళ్ల కిచ్చే పెన్షన్ల బట్వాడ సమయంలో
దసరా మాముళ్ళు వసూలు చేసిన నలుగురు వలంటీర్లు. ఆరోపణలు ఋజువు కావటంతో విధుల నుండి తొలగింపు
ఆంధ్ర ప్రదేశ్  బందరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన  గ్రామ వలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలను ఆవినీతి ఆరోపణ కింద సస్పెండ్ చేశారు.
ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ సమయంలో ఒకొక్కరి నుండి రూ.50/-లు దసరా మాముళ్ళుగా వసూలు చేసినట్టు వీరి మీద ఆరోపణలు వచ్చాయి.
దీనిపై అధికారులు విచారణకు  ఆదేశించగారు. వాళ్లు వసూళ్ళకు పాల్పడినట్టు గ్రామ కార్యదర్శి నివేదిక ఇచ్చారు.
కార్యదర్శి నివేదిక ఆధారంగా వారిమీద చర్యలు తీసుకున్నారు.
అవినీతికి పాల్పడిన  నలుగురు వలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.