లండన్ నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంకు (ఇపుడు న్యాట్ వెస్ట్) లో ఉన్న హైదరాబాద్ నిజాం నిధుల మీద భారత్ కే హక్కు ఉందని, దానిమీద పాకిస్తాన్ క్లెయిమ్ చెల్లదని బ్రిటన్ హైకోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.
దీనితో 70 సంవత్సరాల వివాదానికి తెరపడింది.
‘హైకమిషనర్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ యుకె వెర్సెస్ సెవెన్ అదర్స్’ గా మొదలయిన ఈ వ్యాజ్యాన్ని యుకె హైకోర్టుకు చెందిన జస్టిస్ మార్కస్ స్మిత్ విచారించారు.
కేసులో ప్రధాన విషయం బ్యాంకులో మూలుగుతన్న సొమ్ముకు వారసులెవరనేదే అని జస్టిస్ స్మిత్ చెప్పారు. పాకిస్తాన్ హక్కుందని విషయాన్ని న్యాయమూర్తి నిర్ద్వంద్వంగా కొట్టి వేశారు. భారత్ నిజాం కభళించిందని, అందువల్ల ఈ సొమ్ముమీద హక్కుండదని చేసిన వాదననుకూడా న్యాయమూర్తి కొట్టి వేశారు. తాము నిజాం కు ఆయుధాలు సప్లయి చేసినందుకు ముట్టిన సొమ్ము అన్నవాదనను కూడా కోర్టు కొట్టి వేసింది. ఎందుకంటే, అవి రెండు స్వతంత్ర రాజ్యాల వ్యవహారం కాబట్టి తన పరిధిలోకి రాదని కోర్టు స్పష్టం చేసింది.
ఇండియాలో ఉండాలో, పాకిస్తాన్ లో చేరాలో తేల్చుకోవాల్సి వచ్చినపుడు నిజాం ఈడబ్బును హైదరాబాద్ పోలీస్ యాక్షన్ (ఆపరేషన్ పోలో) సమయంలో అంటే 1948 సెప్టెంబర్ లో లండన్ బ్యాంకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు రికార్డుల వల్ల తేలుతుంది.
నిజాం సంస్థానం ఇండియాలో సెప్టెంబర్ 17,1948 విలీనమయింది. దీనికి మూడు రోజుల ముందు ఈ నిధులను బదిలీ చేశారు. సహజ వారసత్వ హక్కుల ప్రకారం ఈ నిధుల మీద వారసులకే హక్కుఉంటుందనే ది ఆయన వారసుల వాదన.
ఈ డబ్బును డిపాజిట్ చేసింది హైదరాబాద్ కు చెందిన కొంత మంది అధికారులు కాబట్టి, ఈ డబ్బు భారత ప్రభుత్వానికి చెందుతుందని భారత ప్రభుత్వ వాదన.
1957లో కేసు విచారణకు వచ్చినపుడు పాకిస్తాన్, బ్యాంకు, నిజాం వారసులు కోర్టు బయట వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని బ్రిటన్ పార్లమెంటుకు చెందిన హౌస్ ఆప్ లార్డ్స్ చెప్పింది.
1948లో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి కొద్ది రోజుల ముందు నిజాం ఆర్థిక మంత్రి నవాబ్ మొయన్ నవాజ్ జంగ్ పదిలక్షల పౌండ్ల (1,007940.9 పౌండ్లు)ను ప్రభుత్వ నిధిని లండన్ లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంకులోని గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్ కు నుంచి అదే బ్యాంకులో ఉన్నమరొక అకౌంట్ కు బదిలీ చేశారు. మొయిన్ అపుడు నిజాం ఆర్థిక మంత్రి ప్లస్ విదేశీ వ్యవహారాల మంత్రిగాా ఉండే వారు.
ఈ అకౌంట్ అప్పటి యుకె పాకిస్థాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా పేరున ఉండింది. ఈ డబ్బు ట్రాన్స్ ఫర్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోరిక మేరకు జరిగింది.
ఈ నిధులు తమకే రావాలని నిజానికి ఏడో నిజామే 1954లొ క్లెయిమ్(Claim 1954 H No 2387 aka 1954 proceedings) వేశారు. ఇది లండన్ హైకోర్టు లోని చాన్సెరీ డివిజన్ ముందుకు వచ్చింది. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1967లో చనిపోయారు.
అయితే, నిధులు పాకిస్తాన్ హైకమిషనర్ అధికారిక అకౌంట్ లో ఉన్నాయి, కాబట్టి, పాకిస్తాన్ సర్వసత్తాక దేశమయినందున, ఈ నిధులమీద ఇమ్యూనిటీ వుంది అని, దీనిని కోర్టులో విచారించడానికి వీల్లేదని పాకిస్తాన్ 1955లో సావిరిన్ ఇమ్యూనిటీ క్లాజ్ తీసుకువచ్చింది. ఈ వివాదం చివరకుహౌస్ ఆఫ్ లార్డ్స్ దాకా వెళ్లింది.
ఈ వివాదం చివరకు హౌస్ ఆఫ్ లార్డ్స్ (బ్రిటిష్ పార్లమెంటు ఎగువ సభ) దాకా వచ్చింది. సభ న్యాయవిచారణను నిలిపివేసింది. ఇలా కేసులో 60 సంవత్సరాలుగా పెండింగులో ఉంది.
అప్పటి నుంచి ఇప్పటి దాకా వడ్ది మీద వడ్డీ జమ అయి మొత్తం 35 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 306 కోట్లు.
ఈ మొత్తం నిజాం వారసులకు చెందుతుంది. నిజాం రాజ్యం పోయాక చాలా మంది నిజాం వారసులు కష్టాల్లో పడ్డారు. కొందరికి రోజుగడవడమే కష్టంగా ఉందని చెబుతారు.వీళ్లందరికి ఇపుడు ఈ డబ్బు చెందుతుంది. ఇాలాంటి వాళ్లు సుమారు 120 మంది దాకా ఉన్నారని ఒక అంచనా.
బ్యాంకులో ఉన్న మొత్తం తమ దేనని, ఇది నిజాం కు ఆయుధాలు సమకూర్చినందుకు తమకు గిట్టిన పరిహారమని పాకిస్తాన్ వాదిస్తూ వచ్చింది.
అయితే, ఇది అబద్దమని, కేవలం భద్రత కోసం ఈ డబ్బును అపుడు పాక్ బ్రిటన్ హైకమిషనర్ అకౌంట్ లోకి మార్చడం జరిగిందని నిజాం వారసులు వాదిస్తూ వాదించారు.
ఈ నిధి మీద పాకిస్తాన్ తనకే హక్కుందున సావిరిన్ ఇమ్యూనిటీ ని పాకిస్తాన్ 2013లో వదులుకుంది. ఈ సారి తనే కేసు వేసి ఈ డబ్బు తనకే రావాలని పట్టుబట్టింది.
దీనికి ఏడో నిజాం వారసులు వ్యతిరేకత చెప్పారు.వాళ్లు వ్యాజ్యంలోకి దూకి పాకిస్తాన్ వాదనను ఖండిస్తూ ఈ డబ్బు తమకే చెందాలని కౌంటర్ వేశారు.
వారి వాదనను అంగీకరిస్తూ కోర్టు బుధవారం నాడు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా 140 పేజీల తీర్సు నిచ్చింది. ఈ సొమ్ము మీద ఏడో నిజాంకు మాత్రమే అనుభవ హక్కులున్నాయని,అందువల్ల ఆయన వారసులెవరైనా భారత్ లో ఉంటే వాళ్లకి ఈడబ్బును అప్పచెప్పాలని కోర్టు చెప్పింది.
“Nizag VII was beneficially entitled to the fund and those claiming the right of Nizam VII-the princes of India- are entitled to have the sum paid out to their order.” అని కోర్టు స్పష్టం చేసింది.
భారత్ కు ఈ నిధుల మీద హక్కులేదన్న విషయాన్ని కోర్టు కొట్టి వేసింది. నిజాం వారసులు భారత్ తో ఒప్పందం చేసుకోవడంతో భారతదేశం హోదా ఏమిటో తేలిపోయిందని కోర్టు చెప్పింది. భారత ప్రభుత్వం కూడా ఈ నిధుల మీద హక్కుందని కేసు వేసింది. అయితే, ఏడో నిజాం మనవళ్లు ముకరం జా (ఎనిమిదో నిజాం), ఆయన చిన్న తమ్ముడు ముఫకం జాలు కేసు గెలిచాక నిధులను ఎలా పంచుకోవాలనే దాని మీద భారత ప్రభుత్వం తో ఒక అవగాహనకు వచ్చారు.
కేసువేసినపుడు మకరం జా చిన్న పిల్లవాడు. ఇపుడాయన వయసు 80 సంవత్సరాలు. ఈ దశలో గేసుగెలవడం చాలాసంతోషించదగ్గ విషయమని నిజాం తరఫున వాదించిన పాల్ హ్యూట్ అనే న్యాయవాది పేర్కొన్నారు.