భారతీయులకు వార్నింగ్. దేశంలోని ప్రజల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి హైపర్ టెన్షన్ అంటే బిపి తో బాధపడ్తున్నారు.
అంటే దేశ జనాభాలో దాదాపు 30 శాతం మందికి బిపి ఉందని అర్థం. బిపి ఉంటే ఏమవుతుందో తెలుసుగా… హార్ట్ ఎటాక్ రావచ్చు. హర్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, స్ట్రోక్ రావచ్చు. ఇంకా చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి.
దేశంలో 18 సంవత్సరాలు పైబడిన 1.8 లక్షల మందిలో బిపి డేటాను పరిశీలించిన ఒక అధ్యయనం చాలా షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
18-19 సంవత్సరాలున్న యువకుల్లో కేవలం 45 శాతం మందికి మాత్రమే నార్మల్ బిపి ఉంది. 20-24 సంవత్సాల వయోబృందంలో అత్యధిక శాతం మందికి బిపి ఉంది.
ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాలసంస్థ (AIIMS), కేరళ త్రిసూర్ లోని మదర్ హాస్పిటల్, న్యూఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుప్రతి కలసి సంయుక్తంగా Cardiac Prevent 2015 లో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించాయి.
ఈ స్టడీ ఫలితాలను ఇండియన్ హార్ట్ జర్నల్ లో Prevalence of Hypertension among Indian Adults: Results from the Great India Blood Pressure Survey శీర్షికతో ప్రచరించారు.
Cardiological Society of Indiaఈ సర్వే ఫలితాలు 2011 సెన్సస్ డేటాతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాలకు దగ్గిరగా ఉన్నాయి. అంటే భారతదేశంలో బిపి ఎంత ప్రమాదకరంగా మారుతున్నదో అర్థమవుతుంది.
కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 21, 2015న 24 రాష్ట్రాలలో,కేంద్ర పాలిత ప్రాంతాలలో నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంపుల నుంచి బిపి డేటాను సేకరించారు.ఆటోమేటిక్ ఆసిలో మెట్రిక్ మిషన్లు ఉపయోగించి బిపి కొలిచారు.
భారతదేశంలో బిపి బాగా పెరిగిపోతూ ఉంది. ప్రపంచంలోని బిపి పేషంట్లలో 17.6 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. అంటే కుటంబాల మీద, దేశం మీద గుండె జబ్బుల భారం పడబోతున్నదని అర్థం. భారతదేశం చాలా ప్రమాదకరమయిన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలలో 70 సంవత్సరాలలోపు సంభవిస్తున్న మరణాలలో గుండెజబ్బుల వల్ల చనిపోతున్నవారు కేవలం 23 శాతమే. ఇదే భారతదేశంలో 52 శాతం.
18 సంవత్సాలనుంచి వయసు పెరిగే కొద్ది బిపి పెరుగుతూ ఉండటం సర్వేలో కనిపించింది. 65 సంవత్సరాల కింది వయోబృందాలలో పురుషులలో బిపి ఎక్కువగా ఉండటం కనిపించినా, 65 సంవత్సరాలనుంచి పైన స్త్రీ పురుషులిద్దరిలో సమానాంగా బిపి ఉండటం సర్వేలో కనిపించింది.
అందువల్ల బిపిని పరీక్షించుకోవడం అనేది రొటీన్ వైద్య పరీక్ష కావాలని, బిపిగురించి అవగాహన పెరగాలని, రెగ్యులర్ ఎక్సర్ సైజ్ చేస్తూ, బరువు తగ్గించుకుంటూ, ఉప్పు తీసుకోవడం తగ్గించాలని ఈ సర్వేచేసిన డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
AIIMS కు చెందిన డాక్టర్ రామకృష్ణన్ నేతృత్వంలో ఈ సర్వే సాగింది. ఇందులో ఇంకా డాక్టర్ కార్తీక్ గుప్తా (ఎఐఐఎమ్ ఎస్ ), డా.గీవార్ జకరయ్యా (మదర్ హాస్పిటల్ ), అశోక్ సేథ్ (ఫోర్టిస్ ) పాల్గొన్నారు.