ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు టీచర్లకు బంగారు కానుకలు ప్రకటించారు. తన నియోజకవర్గం సిద్దిపేటలోని ఇందిరా నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ కు టీచర్లకు ఒక తులం బంగారు కానుక అందిస్తానని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాదు, తాను సొంతంగా ఈ కానుక అందిస్తునట్లు ఆయన నిన్న హైస్కూల్ లో హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.అంతే కాదు, మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు రు. 25 వేల బహుమానం కూడా ప్రకటించారు.
అయితే, షరతులు వర్తిస్తాయి.
షరతులేమిటంటే, టీచర్లు బాగా శ్రద్ధ తీసుకుని పాఠాలు బోధించాలి. వచ్చే ఎస్ ఎస్ సి పరీక్లల్లో కనీసం 20 మంది విద్యార్థులకు 10 జిపిఎ రావాలి.అపుడు టీచర్లందరికి తులం బంగారు కానుక నా జేబు నుంచి ఇస్తానని నిన్న ఆయన పాఠశాల ను సందర్శించినపుడు చెప్పారు.
సిద్ధి పేట పాఠశాలలో సీట్లకు విపరీతంగా డిమాండ్ వచ్చిందని, సీట్లు లేవనే పరిస్థితి తీసుకువచ్చారని చెబుతూ ఆయన ఉపాధ్యాయులను ప్రశంసించారు. అంతేకాదు, టీచర్లు కూడా తమ పిల్లలను ఇదే పాఠ శాలలో చదివించడం చాలా గొప్ప విషయమని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఇందిరా నగర్ హైస్కూల్ ఆదర్శ ప్రాయమని చెబుతూ ఈ బంగారు కానుక చాలెంజ్ వదిలారు.
ఎస్ ఎస్ సిలో 10/10 సాధించిన విద్యార్థులకు 25 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తానని అదే విధంగా ఈ పాఠశాలలోని పదవ తరగతి చదివే 20 మంది విద్యార్థులు 10/10 సాధిస్తే ఇంచార్జి ఉపాద్యాయులకి10 గ్రాముల బంగారం ఇస్తానని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సత్యసాయి ట్రస్ట్ సహకారంతో అన్ని పాఠశాలల్లో ఉచిత అల్పాహారం అందిస్తున్నాం.