తెలుగుదేశం పార్టీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫెరెన్సలో మాట్లాడుతూ వారిలో ఉత్సహాన్ని నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ఉందని, అవినీతికి గేట్లు తెరించిందని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కాావాలని పిలుపునిచ్చారు. ఆయన ఏమన్నారంటే…
ఏ ప్రభుత్వమూ ఇంత తక్కువ కాలంలో అంటే నూరురోజుల్లోనే ఇంత అప్రతిష్ట పాలు కాలేదు.
కావాలని తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలని చూసి ఆ బురద జగనే పూసుకుంటున్నాడు. పీపీఏ ల పై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖలే దీనికి ఉదాహరణలు
పోలవరం ద్వారా భారీ దోపిడీకి శ్రీకారం చుట్టారు
పోలవరం 750కోట్లు తగ్గించామని చెప్పుకుని 7500కోట్లు నష్టం చేకూర్చారు
ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ క్విడ్ ప్రోకో లో భాగంగానే…, పొలవరంకి గతంలో ఎక్కువ ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేసింది
మెగా సంస్థ కు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్ర బాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారు