సోమశిల వరద నీటిని కందలేరుకు మళ్లించండి, జగన్ కు లేఖ

సార్.. చిత్తూరు జిల్లా నీటి సమస్య పరిష్కారానికి ఉద్దేశించినవి గాలేరు-నగరి , హంద్రీనీవా ప్రాజెక్టులు. జిల్లాలోని తిరుమల తిరుపతి మరియు తూర్పు మండలాలకు నీటి సరఫరా కోసం ప్రతిపాదనలో ఉన్న గాలేరు-నగరి కడప జిల్లాలోని సర్వరాయ సాగర్ వద్ద ఆగింది. శేషాచలం అడవులు దాటి ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితిలో నెల్లూరు జిల్లా కండలేరు నుంచి నీటిని తూసుకోవల్సిన అవసరం ఏర్పడింది.
అవకాశాలు – అవరోధాలు
నెల్లూరు జిల్లా సోమశిల నుంచి కండలేరుకు వరదల సమయంలో కూడా నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేసుకునే అవకాశం లేదు.
సోమశిల సామర్థ్యం 78 టీఎంసీలు. కండలేరు సామర్థ్యం 60 టీఎంసీలు. ఇక్కడి నుంచి తమిళనాడుకు 15 టీఎంసీలు ఇవ్వాలి. కీలక సమస్య సోమశిల నుంచి కండలేరుకు నీటి విడుదల. సోమశిల నుంచి కండలేరుకు రోజుకు 1 టీఎంసీ నీరు మాత్రమే విడుదలకు అవకాశం ఉంది.
ప్రస్తుతం కుందూ నది వరద కారణంగా రోజుకు దాదాపు 5 టీఎంసీల ప్రవాహం ఉన్నది. మరో పది రోజులు ఈ ప్రవాహం ఉంటుంది. సోమశిలలో 50 టీఎంసీల నీరు ఉన్నది 2 , 3 రోజులలో నిండుతుంది. ఆ తర్వాత వరద వారం ఉన్నా కండలేరుకు కేవలం 10 టీఎంసీలు మాత్రమే విడుదల చేయగలరు. కనీసం 20 – 25 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతుంది. కండలేరులో ఉన్న కొద్ధి పాటి నీరు చెన్నై నగరానికి విడుదల చేస్తే చిత్తూరు , నెల్లూరు జిల్లాలకు త్రాగునీరు విడుదల చేయడానికి కూడా సాధ్యం కాదు.
కనుక మీరు జోక్యం చేసుకుని వరదల సమయంలో నీరు సముద్రం పాలు కాకుండా గరిష్ట స్థాయిలో నీటిని కండలేరుకు విడుదల చేయడానికి అనువుగా సోమశిల నుంచి కండలేరుకు నీటిని విడుదల చేసే కాలవ సామర్ధ్యాన్ని 1 టీఎంసీ నుంచి 4 టీఎంసీలకు పెంచాలి.
ఫలితంగా నెల్లూరు జిల్లాలోని 10 మండలాలు. చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి మరియు శ్రీకాళహస్తి , నగరి , సత్యవేడు , చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. కీలకమైన సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది. తమరు పరిశీలించగలరు.
ధన్యవాదాలు
మాకీరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం, తిరుపతి. 9490493436.