ఎపుడూ ఇంత క్ష్యోభ పడలేదు : చంద్రబాబు

నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడని  క్ష్యోభ ని నేను అనుభవిస్తున్నానని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య మీద ఆయన నేడు వ్యాఖ్యానించారు

కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా కేసులు పెట్టాలని రెచ్చకొట్టాడని,

 

ఏవో కేసులు పెట్టి ఆయనను  మానసికంగా కుంగతిసారని అన్నారు. చివరకు

కోడెల లాయర్స్ ని  కూడా ఇష్టం వచ్చినట్లు దుర్భాశలాడారని ఆయన అన్నారు.

నాగరాజు, వెంకయమ్మ, రవి, శ్రీనివాస్ అనే  పేర్లతో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారని చెబుతూ కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే

*నాపై రాజశేఖర్ రెడ్డి 26 కేసులు పెట్టారు ఎక్కడా రుజువు చెయ్యలేదు*

జగన్ కి ప్రజలు అధికారం ఇస్తే పాలన చేయకుండా కేసులకు ప్రయార్టీ  ఇస్తున్నాడు. ఆసెమ్బ్లీ  ఫర్నిచర్ పై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.. లేఖలు రాశారు. ఆయినా  కేసులు పెట్టారు

నన్నపనేని రాజకుమారి పై నిన్న ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టారు.

అచ్చం నాయుడు, కుటుంబరావుల పై కేసులు పెట్టారు.

జగన్ ప్రభుత్వంలో ఉన్మాదులు తయారు అయ్యారు.

కోడెల శివప్రసాదరావు టైగర్ లాగా బ్రతికాడు బ్రతుకుతాడు అనుకున్నా.

కోడెల కట్టుకున్న లుంగీ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

నాతో పాటు 11మంది సీఎం లను చూసాను..కానీ ఎప్పుడూ ఇలాంటి ప్రభుత్వం చూడలేదు.

*కోడెల మరణం పై సీబీఐ విచారణ జరిపించాలి*

రాష్ట్రానికి వందరోజుల్లో జరిగిన డ్యామేజ్ పై విచారణ జరిపించాలి.

పోలీస్ యంత్రాంగం సైతం ఎందుకు సరెండర్ అయిందో అర్థం కావడం లేదు.

నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడని క్షోభని నేను అనుభవించాను.

*వ్యక్తుల మనోభావాల పై దెబ్బకొట్టాలని ప్రభుత్వం చూస్తుంది

*22 ఏండ్లు అధికారం 19 ఏండ్లు ప్రతిపక్షంలో ఉన్నాము.

*43 వేల కోట్లు దోచుకొని 11 చార్జిషీట్ లలో జగన్ ముద్దాయి.

*నిన్న మధ్యాహ్నం నుంచి నా మనసు బాగాలేదు

*ప్రభుత్వ చర్యల పై నేను పోరాటం చేస్తా..

బసవతకారం హాస్పిటల్ ట్రస్ట్ మెంబర్ ఆయన.

గుండెపోటు అనేది అవాస్తవం.