చంద్రయాన్-2 దేశంలో స్పేస్ రీసెర్చ్ మీద, ప్రయోగాల మీద కనివిని ఎరుగని చైతన్యం తీసుకువచ్చింది.
ఇంతవరకు ఎవో పరీక్షల బిట్ క్విశ్చెన్లకు పరిమితమయిన ISRO (ఇస్రో) అనే నాలుగు అక్షరాల ఇంగ్లీష్ మాట పలకని భాతీయుడు లేడేమో ఇపుడు. ఇస్రో భారతీయుల గుండెచప్పుడయింది.
అంతేకాదు, చంద్రయాన్ 2 ల్యాండర్ వైఫల్యాన్ని ఎవరూ వైపల్యంగా చూడటమే లేదు. ఇది ఇస్రోకి కొండంగ నైతిక శక్తి యిస్తుంది.
ఇస్రో చంద్రయాన్ అనే మాటలు ప్రతిధ్వనించని ఇల్లు లేదిపుడు భారత్ లో. చదువుకున్న వాళ్లని, చదువురాని వాళ్లని, విద్యార్థులని… ఇలా అన్ని వర్గాల వారిని చంద్రయాన్ 2 ఉత్తేజపరిచింది.
ఈ నేపథ్యంలో నాగపూర్ పోలీసులు చంద్రుడి ఉపరితలం మీద ఇస్రో సిగ్నల్ జంప్ చేసిన విక్రమ్ లాండర్ దారికి రావాలని పిలుపునిచ్చారు. సిగ్నల్ జంప్ చేసినందుకు ఛలాన్ రాయమని హమీ ఇస్తూ ట్విట్టర్ నోటీసు పంపారు.
ఈ ట్వీట్ సరదాగానే షేర్ చేసినా అది చంద్రయాన్ అవేర్ నెస్ ఎంత డీప్ గా ఇండియన్ సైకీలోకి చొచ్చుకుపోయిందో చెబుతుంది.
ఇలాంటి మరొక మహత్తర సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని శ్రీ కృష్ణ జన్మభూమి అయిన మథుర లో జరగబోతున్నది. ఈ ఏడాది అక్కడ జరిగే ప్రఖ్యాత పండుగ చప్పన్ భోగ్ (Chappan Bhog) మహోత్సవాన్ని చంద్రయాన్ 2 అంకితమిచ్చారు.
ఛప్పన్ భోగ్ అనేది మూడు రోజుల పండగ. ఈ నెల 10 న అంటే ఈరోజు మొదలయింది. ఈ ఉత్సవాలలో భక్తులు 56 (ఛప్పన్) రకాల వంటలను శ్రీకృష్నుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. వేలాది మంది భక్తులు , యాత్రికులు శ్రీకృష్ణుడి రథంతో అక్కడి గోవర్దనగిరి చుట్టూ 23 కిమీ ప్రదక్షిణ చేయడంతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి.
https://trendingtelugunews.com/nagapur-police-notice-to-vikram-lander-who-broke-the-signals-on-moon/