చంద్రుని మీద సాఫీ గా దిగేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాల్లో సక్సెస్ రేట్ 60 శాతం మాత్రమే.
గత ఆరు దశాబ్దాలలో మొత్తం 109 చంద్రమండల యాత్రలు సాగాయి. ఇందులో 61ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. 48 ఫెయిలయ్యాయని నాసా ఫాక్ట్ షీట్ చూస్తే అర్థమవుతుంది. నాసా వైఫల్యాలా జాబితా కూడా చాలా పెద్ద దే.
చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలోసాఫీగా ఒక మూన్ ల్యాండర్ ను దించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ తెల్లవారు జామున చేసిన ప్రయత్నం ఫలించలేదు. చంద్రుని ఉపరితలానికి 2.1 కిమీ ఎత్తున ఉన్నపుడు ల్యాండర్ విక్రమ్ కి భూమికి సంబంధాలు తెగిపోయాయి.
ఈ నేపథ్యంలో మూన్ మిషన్ ల సక్సెస్ రేటు చర్చకు వచ్చింది.
మూన్ మిషన్ వైఫల్యాల జాబితా ఇదిగో ఇక్కడ ఉంది.
ఇస్రో గమ్యం చేరుకోలేక పోవడం భారత దేశ ప్రజలను నిరుత్సాహ పర్చలేదు. సరిగదా భారతీయ విద్యార్థులను బాగా ఉత్తేజపరిచింది.
1969లో అపోల్ 11 మిషన్ లో అమెరికా వ్యోమగాములు చంద్రుని కాలు మోపినపుడు ప్రజలు, యువకులు, శాస్త్రవేత్తలు ఉత్తేజితులుయ్యారు. అది ఈ తరాలనుకూడా ఉత్తేజ పరుస్తూ వస్తున్నది.
https://trendingtelugunews.com/18-imp-points-about-isros-space-programme/
ఇపుడు భారత చంద్రయాన్ 2 కూడా విపరీతంంగా భారతీయవిద్యార్థులను ఉత్తేజపరిచింది. ల్యాండర్ దిగలేకపోవడం సంగతటుంచితే, చంద్రుని చుట్టూ చంద్రయాన్ 2 అర్బిటర్ ఒక ఏడాది పాటు తిరుతూ ఉంటుందనేది చాలా మందిని ఉత్తేజ పరుస్తుంది. నిన్నటి ప్రయోగాన్ని ఎంతో ఉత్కంఠతో చూశాక ఎక్కువ మంది స్పేస్ సైన్స్ మళ్లినా ఆశ్యర్యం లేదు.
సక్సెస్ రేట్ విషయానికి వస్తే 2018 ఫిబ్రవరిలో ఇజ్రేల్ ప్రయోగించిన బేర్ షీట్ ల్యూనార్ మిషన్ ఈ ఏప్రిల్ విఫలమయింది. బేర్ షీట్ కూలిపోయింది.
1958-2019 మధ్య అమెరికా, రష్యా ( లేదా నాటి యుఎస్ ఎస్ ఆర్)జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, ఇజ్రేల్ లతో పాటు భారత్ చంద్రమండలానికి యాత్రలు జరిపింది. ఇందులో అర్బిటర్స్, ల్యాండర్స్, ఫ్లైబై లు ఉన్నాయి.
మొట్టమొదటి మూన్ మిషన్ 1958 ఆగస్టు 17 పయనీర్ అనే స్పేస్ క్రాఫ్ట్ తో మొదలయింది.అది విఫలమయింది. మొదట విజయవంతంగా మూన్ మిషన్ జరిపింది సోవియట్ యూనియన్.
1959 జనవరి 4 ఆరో ప్రయత్నంలో ఆ దేశం మూన్ ఫ్లైబై ప్రయోగించింది. తర్వాత చంద్రునికి బాగా దగ్గరిగా జరిగి క్లోజ్ అప్ ఫోటోలు తీసింది అమెరికా. రేంజర్ 7 ని 1964 జూలైలో ప్రయోగించి అమెరికా ఈపోటోలు తీసింది.
ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యూనార్ సర్ ఫేస్ మొదటి ఫోటోలను 1966లో రష్యా ల్యూనా 9 ద్వారా సాధించింది.
తర్వాత అపోలో 11 యాత్ర ఏకంగా మనిషి ని తొలిసారి చంద్రుడి మీద కాలుమోపేలా చేసి మానవ జాతి చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించింది. అపుడు ముగ్గురు వ్యోమగాముల బృందానికి నీల్ అర్మ్ స్ట్రాంగ్ నాయకత్వం వహించారు.
1958-1979 మధ్య కేవలం అమెరికా, యుఎస్ ఎస్ ఆర్ లు మాత్రమే చంద్రయాత్రలు జరిపాయి. ఈ 21 సంవత్సరాలలో ఈ రెండు దేశాలు 90 ప్రయోగాలు చేశాయి.