నగరాలలో ఎక్కడబడితే జిమ్స్ వస్తున్నాయి, జిమ్ కల్చర్ బాగా పెరిగిపోతున్నది. మంచిదే. అయితే అంతే వేగంగా కార్పొరేట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల నడుము చుట్టు కొలత కూడా పెరుగుతూ ఉంది.అదే వర్రీ. జిమ్ ల ఇంపాక్ట్ పెద్దగా కనిపిస్తూన్నట్లు లేదు.
ఉద్యోగాలలో వత్తిడి ఎక్కువగా ఉండటం, కుర్చికే అతుక్కుపోయి దినమంతా పనిచేస్తూ ఉండటం, సాయంకాలం స్నాక్స్ బాగా మెక్కుతూ ఉండటంతో వీళ్ల నడుములు భారీగా పెరుగుతున్నాయ్.
కార్పొరేట్ కంపెనీలలో ఉన్న ఎగ్జిక్యూటివ్ లలో మూడింట రెండు వంతులు వోవర్ వెయిట్ తో ఉన్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. వీళ్ల బాడి మాస్ ఇండెక్స్ 25 పైబడే ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే బాడిమాస్ ఇండెక్స్ 24.9 లోపే ఉండాలి. స్పష్టంగా చెబితే దేశంలోని ఎగ్జిక్యూటివ్ లలో 63 శాతం మంది వోవర్ వెయిట్ తో ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది.
ఇది చాలా ప్రమాదకరమయిన సంకేతం. ఎందుకంటే, వొళ్లు పెరగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.
ఇప్పటికే ఇండియాకు మధుమేహం క్యాపిటలయిపోతున్నదన్న పేరొచ్చింది. ఇండియాకు రాబోయ్ అతి పెద్ద చాలెంజ్ మధుమేహమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తున్నది.
దేశ జనాభాలో 8.7 శాతం మంది ఇప్పటికే డయాబెటీస్ తో భాధపడ్తున్నారు. ఈ సమస్య 20-70 వయసున్నవారందరిలో పెరుగుతూ ఉంది.
కార్పొరేట్ ఇండియా ఫిట్ నెస్ రిపోర్ట్ వివిధ రంగాల కార్పొరేట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ ల ఫిట్ నెస్ వ్యవహారాన్ని విశ్లేషించి, ఎగ్జిక్యూటివ్ ల ఆరోగ్యం మధుమేహం అంచుకు ఎలా జరగుతున్నదో వెల్లడించింది.
ఈ రిపోర్టు ప్రకారం, ఫైనాన్సియరల్ సర్వీసెస్ , మాన్యు ఫ్యాక్చరింగ్ రంగాల కంపెనీలలో పని చేసే వాళ్ల లైఫ్ స్టయిల్ కొంచెం కూడా యాక్టివ్ గా లేదు. వారాంతాలలో వీళ్ల మరీ పనిలేకుండా గడుపుతున్నారు. పనిదినాల్లో శరీరంలో కొవ్వులు కొంతయినా కరుగుతూ ఉంటే, వారంతపు రోజుల్లో ఇది బాగాతగ్గిందని నివేదిక చెబుతూ ఉంది.
కన్స్యూమర్ గూడ్స్, ఎఫ్ ఎమ్ సిజి పరిశ్రమల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ల పరిస్థితి కొంచెం ఫైనాన్సియల్ సర్వీసెస్ ల్ వాళ్లకంటే మెరుగ్గా ఉందని, వీళ్లు ‘చాలా యాక్టివ్’ ఉన్నారని కనీసం రోజు ఒక వేయడుగులైనా నడుస్తున్నారని ఈ రిపోర్టు పెర్కొంది.
రిటైల్ సెక్టర్ లో పనిచేసే వాళ్లు బాగా ఫ్యాట్ ఉండే తిండి తింటూంటే ఎఫ్ ఎమ్ సి జి రంగంలో పనిచేసే వాళ్ల ప్రొటీన్ల ఫుడ్ తింటున్నారని ఈ నివేదిక చెప్పింది.వీళ్ల ఆహారం ప్రొటీన్ల పరిస్థితి ఎలా ఉందో చూడండి.