హాంకాంగ్ చాలా రోజులుగా కనివిని ఎరుగని నిరసనో ద్యమాలను ఎదుర్కొంటూన్న సంగతి తెలిసిందే.
విస్తృత ప్రజాప్వామ్యం కోరుకుంటూచైనా పెత్తనానికి వ్యతిరేకంగా హాంకాంగ్ విద్యార్థులు తిరుగుబాటులో ఉన్నారు.వీళ్లనిఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక చైనా ప్రభుత్వం తల పట్టుకుంది.
అయితే,ఇది చైనా గోడవనుకుంటూ పొరపాటు.
హాంకాంగ్ నిరసన సెగలు భారత్ ను కూడా తాకుతున్నాయి. భారత్ నుంచి హాంకాంగ్ కు సాగుతున్న అభరణాల ఎగుమతులు బాగా పడిపోయాయి.
భారత్ అభరణాల వ్యాపారానికి చాలా పెద్ద విదేశీ మార్కెట్ హాంకాంగే. హాంకాంగ్ ఎగుమతులు 6.6 పడిపోయాయని జెమ్ అండ్ జ్యుయలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది.
భారత్ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే అభరణాలలో మూడో వంతు వెళ్లేది హాంకాంగ్ కే. ఇప్పటికే చైనా-అమెరికా ట్రడ్ వార్ కారణంగా ఈ ఎగుముతులు గత ఏడాది 17 శాతం పడిపోయాయని లైవ్ మింట్ పేర్కొంది..
ఇదేసమయంలో ప్రపంచ వ్యాపితంగా ఆర్థిక ప్రగతి మందగిస్తూ ఉంది. హాంకాంగ్ లో అశాంతి వాతావరణం ఇలా కొనసాగితే జెమ్ అండ్ జ్యుయలరీ వ్యాపారం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సబ్యసాచి రే పేర్కొన్నారు.
ఇప్పటికి హాంకాంగ్ నిరసనోద్యమం ఆగకుండా మూడునెలలుగా కొనసాగుతూ ఉంది. హంకాంగ్ నుంచి నేరస్థులను చైనా భూభాగానికి బహిష్కరించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయింది. ఈ బిల్ ను రద్దు చేయాలని ఆందోళన కారులు కోరుతున్నారు. దీనితో పాటు అరెస్టయిన వారందరిని విడుదలచేయాలని, హాంకాంగ్ లో సార్వత్రిక వోటు హక్కుండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన వల్ల హాంకాంగ్ కు చైనా భూభాగం నుంచి వచ్చే పర్యాటకు సంఖ్య పడిపోయింది. దీనికి తోడుగా ఇపుడు బంగారు ధరలు కూడా పెరిగాయి.
హాంకాంగ్ పర్యటన కొస్తున్న వారికి ఇప్పటికే పలుదేశాల భద్రతకు సంబంధించి ప్రకటనలు చేయడంతో ఈ నగరానికి వచ్చే వారి సంఖ్య బాగా పడిపోయింది. దీని ప్రభావం సెప్టెంబర్ 16 నుంచి 22 దాకా జరిగే హంకాంగ్ జెమ్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెయిర్ మీద పడుతుందని వర్తకులు ఆందోళన చెందుతున్నారు.