వైఎస్సార్ పెళ్లికానుక పథకానికి ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వివాహం చేసుకున్న వారికి పెళ్లిరోజే వైయస్సార్ పెళ్లి కానుకను అందించాలని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. శ్రీరామనవమి పర్వదినం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది.
ఈ పథకం కింద
• దాదాపు 96,397 మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా • మొత్తంగా రూ.746.55 కోట్లు ఏడాదికి ఖర్చు చేయనున్న ప్రభుత్వం • ఎస్సీలకు రూ.40వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు • ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ. 1లక్ష పెంపు • బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50వేలు పెంపు • మైనార్టీలకు రూ. 50వేల నుంచి రూ.1 లక్ష పెంపు • వికలాంగులకు రూ.1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలు పెంపు • భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.2వేల నుంచి రూ.1లక్షకు పెంపు • ఎస్సీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ.1.20 లక్షలు • ఎస్టీ కులాంతర వివాహాలు చేసుకుంటే… .రూ. 1.20లక్షలు • బీసీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ. 70వేలు