ఈ పిడుగుల కోసం కేంద్ర మంత్రి వేట… కనబడితే చెప్పండి… (Amazing Video)

మీకి విషయం తెలుసా, భారత దేశంలో ట్వి ట్టరులంతా  ఇపుడు ఇద్దరు పిల్లలకు కోసం వెదుకుతున్నారు. వాళ్లిద్దరు- ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, కనబడితే పట్టుకెళ్లి కేంద్రమంత్రి ముందు ప్రవేశపెడతారు. వాళ్లని చూడ్డానికి లక్షలాది మంది ట్విట్టరులు వేయికళ్లతో ఎదరుచూస్తున్నారు. అంతేకాదు, ఒక ఒలింపిక్ మహారాణి కూడావాళ్లకోసం ఆత్రంగా ఎదు రుచూస్తూ ఉంది.
అసలు కధేందంటే…
ఎదో వూర్లో ఒక రోజు స్కూలు కు పోతూన్ననపుడో వస్తూన్నపుడో రోడ్డు మీద వాళ్లిద్దరు అద్భుతమయి పల్టీ  విన్యాసం (gymnastics) చేశారు.
దీన్నెవరో పర్ ఫెక్ట్ గా వీడియాతీశారు.
దాని క్లిప్పొకటి డాక్టర్ ఎమ్వీ రావ్ (1988 బ్యాచ్, వెస్టు బెంగాల్ క్యాడర్ ) అనే  తెలుగు ఐఎఎస్ ఆఫీసర్ కంట బడింది. డాక్టర్ రావ్ టాలెంట్ వెదికిపట్టి సానబట్టి మెరిసేలా చేయడంలో దిట్ట.
ఈ తెలుగు ఐఎఎస్ ఆఫీసర్ బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలో ఒక నిశబ్ద విప్లవం తీసుకొస్తున్నారిపుడు. ఆ మధ్య ఆయన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ ఫిషరీస్ డెవెలప్ మెంట్ బోర్డు సిఇవొ గా కూడా పనిచేశారు.
 ఈ వీడియోలో కుర్రకుంకల టాలెంట్ చేసి ఆశ్చర్యపోయి  దా న్ని ట్విట్లర్లో వదిలేశారు. అంతే, అది భూమండల ప్రదక్షిచేసింది. వీడియో చూసిన  11 లక్షల మందిలో రుమేనియా ఒలింపిక్ రాణి నాడియా కొమనేచ్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఉన్నారు.

1976 మాంట్రియల్ ఒలింపిక్స్ జిమ్మాస్టిక్ విజేత. అపుడే అమెకు పర్ ఫెక్ట్ 10 అని పేరొచ్చింది. రోెడ్డు మీద  ఈ పిల్లలు ప్రదర్శించిన జిమ్మాస్టిక్ స్కిల్స్ చూశాక దిమ్మతిరిగిన నాదియా This is Awesome అని ట్వీట్ చేశారు.

ఈ వీడియోని అంతకు ముందే  కిరెన్ రిజ్జూ కూడా చూశారు. అంతే, ఆయన వాళ్లని పట్టుకునేందుకు వేట ప్రారంభించండని అధికారులను ఆదేశించారు.

FLASH… FLASH… FLASH

చిక్కు ముడి వీడింది, జిమ్మాస్టిక్స్ పిడుగులిద్దరు దొరికారు!

నిజానికి What a perfect picture! Future Gymnasts in Making అని MV Rao ఆగస్టు 25న ట్వీట్ చేశారు. 24 గంటల్లో ఇది మంత్రి కంటపడింది.ఆగస్టు 26 నుంచి ఈ చిచ్చర పిడుగల  కోసం గాలింపు మొదలయిది. ఆగస్టు 29న రుమేనియా ఒలింపిక్ రాణి కొమనేచ్ కంట పడింది.
ఈ పిల్లల్లో టాలెంట్ ముడిసరుకుంది. ఎవరైనా వీళ్లని పట్టుకొని వస్తే వీళ్లని జిమ్మాస్టిక్ అకాడెమీ చేర్పిస్తానని కిరెన్ రిజిజు ట్వీట్ చేశారు.
దీనితో వీడియో ఇంకా పాపులర్ అయింది. ఇపుడు National Sports Day హ్యాష్ ట్యాగ్ తో తిరుగుతూ ఉంది.
కొమనేచ్ ట్వీట్ చూశాక రిజిజు మరొక సారి స్పందించారు.

నాదియా కొమనేచ్ కూడా ఈ వీడియోకు స్పందించడం చాలా సంతోషంగా ఉంది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ లో పర్ ఫెక్ట్ 10 సాధించారు. తర్వాత మరొక ఆరు ఫర్ ఫెక్ట్ టన్స్ సాధించి మూడు బంగారాలు గెల్చుకున్నారు. ఈపిల్లలను నా దగ్గిరికి తీసుకురండని అందరికి చెప్పానని రిజిజు ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి

‘నైక్’ స్పోర్ట్స్ షూ గురించి మీకీ విషయాలు తెలుసా?