ప్రపంచంలో అధ్లెట్ షూ లో ఈజీగా గుర్తుపట్టగలిగన బ్రాండ్లలో నైక్ (Nike) ఒకటి. ఈ షూ తయారుచేసే కంపెనీని ఒరెగాన్ యూనివర్శిటీ కి చెందిన ఫిల్ నైట్ అనే ట్రాక్ అధ్లెట్, అతని కోచ్ బిల్ బోవర్ మన్ 1964లో స్థాపించారు.
నైక్ షూ కి లైఫ్ ఆ కంపెనీ లోగో. లోగ్ టిక్ మార్క్ లాగా కనిపిస్తుంది. దాని వెనక చాలా మీనింగ్ ఉంది. అది, గాలిలో ఎగరడానికి, వేగానికి, చలాకీ తనానికి ప్రతీక. ఇదెలా తయారయింది?
నైట్, బోవర్ మన్ లు తయారుచేయాలనకుంటున్నది పరుగు పందాల అథ్లెట్స్ కు అవసరమయిన షూ. అపుడు అమెరికాలో దొరికే షూ ఏమీ బాగాలేవని స్వయంగా అధ్లెట్ అయిన నైట్ అనే వాడు.
అందువల్ల వాళ్లు మాంచి రకం షూని కొత్తగా తయారుచేయాలని నిర్ణయించుకున్నారు.తమ బిజినెస్ కు తగ్గ లోగో తయారుచేయాలని కెరొలిన్ డేవిడ్ సన్ అనే మహిళా గ్రాఫిక్ డిజైనర్ విద్యార్థికి అప్పగించారు.
ఆమె 1971లో 17 గంటల్లో ఈ పని పూర్తి చేసింది. ఎంత డబ్బడిగిందో తెలుసా? కేవలం 35 డాలర్లు. అదీ సంగతి.
అపుడామె పోర్ట్ లాండ్ స్టేట్ యూనివర్శిటీలో గ్రాఫిక్ డిజైనర్ స్టూడెంట్. నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకు ఏదైనా డిజైనింగ్ పని చేద్దామనకుంటూ ఉండింది. అలాంటపుడు డేవిడ్ సన్ కు లోగ్ తయారుచేసేందుకు నైట్ ఆఫర్ ఇచ్చాడు. గంటకు రెండు డాలర్లు ఇస్తానన్నాడు.
షూ పక్కల (sides) వేసేందుకు వీలైన గీత లాంటి లోగో కావాలన్నాడు. ఫైనల్ చెక్ మార్క్ లాగా గీతను ఆమె సృష్టించారు. దీని స్వూష్ అంటారు. ష్వూష్ అంటే… గాలి మన చెవి దగ్గిర నుంచి అకస్మాత్తుగా, వేగంగా దూసుకుపోతే వచ్చే సుయ్ మనే ధ్వని. అందులో అథ్లెట్ వేగముంది. పరుగులో ఉన్నపుడు క్రీడాకారుడి వొళ్లు వొంపు కూడా అందులో ఉంది. పక్షి ఎగిరినపుడు విచ్చుకునే రెక్క కూడా ఉంది.
ఇది నైట్, బోవర్ మన్ లకు బాగా నచ్చింది. ఎందుకు 35 డాలర్లే చార్జ్ చేశారంటే డేవిడ్ సన్ ని అడిగితే లోగోకు తుది రూపం ఇచ్చేందుకు తనకు 17.5 గంటలే పట్టాయి. గంటకు డాలర్ల రేట్ నిర్ణయించారు. అందువల్ల 35 డాలర్ల బిల్లు ఇచ్చానని అమె చెప్పారు.
డిజైనర్ కు భారీ బహుమానం
ఈ మధ్యలో కంపెనీ సూపర్ హిట్టయింది. తర్వాత ఆమెకు భారీగా సన్మానం చేశారు. ఆ సందర్భంగా ఆమెకు మిలియన్ డాలర్ల కంపెనీ స్టాక్ఇచ్చారు. అంతేకాదు, స్వూష్ మార్క్ ఉన్న బంగారు ఉంగరం కూడా కానుకగా ఇచ్చారు.
2.అమెరికన్ అథ్లెట్స్ కు బెస్ట్ షూ అందించే ప్రాజక్టు ప్రారంభించి నైక్ దాకా రావడానికి నైట్, బోవర్ మన్ లు సాగించిన యాత్రలో చాలా ఆసక్తి కరమయిన విషయాలున్నాయి. ఈ మధ్యలో వాళ్లు జపాన్ నుంచి షూ దిగుమతి చేసుకుని హై స్కూల్ విద్యార్థులకు, అథ్లెట్స్ కి విక్రయించడం మొదలుపెట్టారు.
3. అపుడు వారి కంపెనీ పేరు బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్. జపనీస్ షూ మేకర్ ఒనిత్సుకా టైగర్ (Onitsuka Tiger)కు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత జపనీస్ కంపెనీతో తెగతెంపులు చేసుకున్నారు. తర్వాత కంపెనీ పేరును ‘డైమెన్షన్ 6’ అని మార్చారు. ఆపైన దీనిని నైక్ (Nike)గా మార్చారు. నైక్ అంటే గ్రీకుల విజయ దేవుడు (God of Victory).
4.నైక్ బిజినెస్ స్లోగన్ ‘Just Do It’ ఎలా వచ్చిందో తెలుసా? ఇవి ఒక మరణశిక్ష పడిన హంతకుడి నోటి నుంచి వెలవడిన చివరి మాటలు. గ్యారి మార్క్ గిల్ మోర్ అనే నేరస్థుడు రెండు హత్యలు చేసి మరణ శిక్ష ఎదుర్కొంటున్నాడు.నైక్ మార్కెటింగ్ ఎజన్సీరి గిల్ మోర్ చివరిమాటలు నైక్ క్యాంపెయిన్ కు బాగా పనికొస్తాయనిపించింది. 1988లో ఈ మాటలను కొద్దిగా మార్చి స్లోగన్ గా తీసుకుంది. గిల్ మోర్ కు జనవరి 17,1977లో ఫైరింగ్ స్క్వాడ్ మరణ శిక్ష అమలు చేసింది. నీ ఆఖరి మాటలేమిటని అధికారులు అడిగినపుడు గిల్మోర్ చెప్పింది, “Let’s do it”. దానిని కొద్దిగా మార్చి Just Do It చేసి నైక్ కు అందించారు. ఈ స్లోగన్ కూడా స్వూష్ లాగే బాగా పాపులర్ అయింది. ఈ స్లోగన్ తో 1888-98 మధ్య నైక్ చేసిన షూ ప్రమోషన్ క్యాంపెయిన్ లో షూ బిజినెస్ అమెరికా మార్కెట్ లో 18 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. ఈ స్లోగన్ స్వూష్ పక్కనే పొందుపర్చారు.
5. నైక్ లోగోని మొదట స్ట్రిపే ( Stripey) అని పిలిచే వారు.
6. 1987లొ నైక్ ఎయిర్ మాక్స్ షూ ని ప్రమోట్ చేసేందుకు బీటిల్స్ సాంగ్ ‘రెవల్యూషన్ ’ ను వాడారు. బీటిల్స్ దీనికి వప్పుకోలేదు. కోర్టులో కేసు వేశారు. నైక్ 15 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.
7. అద్భుతంగా అడ్వర్టయిజ్ చేయడంలో నైక్ విజయవంతమయింది. దీని యాడ్ కమర్షియల్స్ 2000,2002లో ఎమీ అవార్డులు గెల్చుకున్నాయి.
8. నైక్ కంపెనీని ప్రారంభించి 55 సంవత్సరాలయింది. ఇప్పటీకి ప్రపంచంలోని టాప్ షూ బ్రాండ్ లలో నైక్ ఒకటిగా నిలబడి ఉంది. కంపెనీ బిజినెస్ ఎంతో తెలుసా? 36.39 బిలియన్ డాలర్లు.