ఈ రోజు బంగారం కట్లు తెంచుకుంది. ఇంతవరకు ఎపుడూ లేని రికార్డు స్థాయికి బంగారు ధర చేరుకుంది. పది గ్రాముల బంగారు ధర గురువారం మరో మారు భారీగా పెరిగి రు. 40,220 పలికింది.
జాతీయ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99. 9 శాతం ప్యూర్ బంగారం ధర రు. 250 పెరిగి రు.40,22 కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
ఇక 99.5 శాతం ప్యూర్ గోల్డ్ పదిగ్రాముల ధర రు. 40,050 పలికింది. ఇక వెండి కూడా ఇదే బాటల్ ప్రయాణించింది. ఈ రోజు 220 రుపాయలుపెరగడంతో కిలో వెండిధర రు. 49,050కు చేరింది.
ఫ్యూచర్స్ మార్కెట్ కూడా ఇదే ట్రెండ్ చూపింది. ఎంసిఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ రు. 39,425 కు చేరింది. ఇదొక రికార్డు. వెండి ఫ్యూచర్స్ కిలో రు47,440 కి చేరింది.
రుపాయ విలువ పడిపోవడం, అంతర్జాతీయ చైనా-అమెరికా ట్రేడ్ ఉద్రిక్తత కొనసాగుతూ ఉండటం బంగారు ధరలు మండిపోయాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ ధర రు. 1,556డాలర్లకు చేరుకుంది.