[ajax_load_more post_type=”post” sticky_posts=”true” post_format=”standard” offset=”6″ scroll=”false” transition=”none”]
అపుడు జైట్లీ వయసు కేవలం 22 సంవత్సరాలే. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 1975 జూన్ 25 అర్థరాత్రి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జన్నీ ప్రకటించారు. దేశమంతా ప్రతిపక్ష నాయకుల అరెస్టు సాగుతున్నాయ్.
ఢిల్లీ రాజకీయ ఉద్యమాలు మొదట అక్కడి యూనివర్శీటీ నుంచే మొదలవుతాయి. కాబట్టి ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఎలుగెత్తాల్సింది కూడా ఢిల్లీ యూనివర్శీటి విద్యార్థి సంఘమే. అక్కడ యూనివర్శిటీ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి ఎబివిపి గెలిచింది.
అందువల్ల ఎబివిపి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. ఆ బాధ్యత లా చదువుతున్న అరుణ్ జైట్లీ మీద పడింది.
ఎమర్జీన్నీ ప్రకటన వెలువడడం వాజ్ పేయి, అద్వానీ, మల్కానీ వంటి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ఒకే సారి జరిగాయి. జైట్లీ ని అరెస్టు చేసేందుకు ఢిల్లీలోని నరైనా ప్రాంతంలో ఉన్న ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వచ్చారు. వారితో తండ్రి వాదిస్తూ ఉండటాన్ని జైట్లీ చూశాడు.అంతే గోడదూకి వెనక వైపు నుంచి పారిపోయి ఒక స్నేహితుడి ఇంట్లో ఆ రాత్రి గడిపాడు.
మరసటి రోజు పొద్దునే కొంతమంది మిత్రులను పోగేసుకుని వచ్చి ఇందిరా గాంధీ బొమ్మ దగ్ధం చేశాడు. పోలీసులు అరెస్టు చేశారు. దీనితో ఎమర్జీన్సీ వ్యతిరేకించిన తొలి సత్యాగ్రహి అయ్యాడు.
జైట్లీని మొదట అలీపూర్ జైలుకి తీసుకెళ్లారు. తర్వాత మీసా (Maintenance of Internal Security Act) కింద అరెస్టు చేశారు. తర్వాత తీహార్ జైలు వార్డనెంబర్ 2కు తరలించారు. అక్కడొక వారం రోజులు గడిపాక హర్యానాలోని అంబాలా జైలుకు తరలించారు. మూడు నెలల తర్వాత ఆయన్ని మళ్లీ తీహార్ కే తీసుకువచ్చారు. 1977 జనవరి దాకా ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు.
తర్వాత 19 నెలలు జైలులోఉన్నాడు.