భారతీయ జనతాపార్టీ ఇటీవల చాలా మంది ప్రతిభావంతులయిన నాయకులను కోల్పోయింది. వీళ్లు పార్టీలో ఉంటే సంస్థాపరంగా, ప్రభుత్వంలో ఉంటే పాలనా దక్షులుగా పేరున్నవాళ్లు.
అందుకే ఈ నేతలు అకాలంలో చనిపోవడం బిజెపికి తీరనిలోటు. వీళ్లు అనంతకుమార్, సుష్మస్వరాజ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పర్రీకర్ లు. అయితే, మొదటి ముగ్గురు పార్టీలోను, ప్రభుత్వంలోనూ చాలా పేరున్న వాళ్లు. పర్రీకర్ ఢిల్లీ రాజకీయాలకు ఇటీవలే పరిచయయిన గోవా నాయకుడు.పర్రీకర్ మార్చి 17, 2019న అనారోగ్యంతో చనిపోయారు.
అనంతకుమార్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీలు పార్టీలో కూడా ఉన్నత పదవులు చేపట్టిన వాళ్లు. అందుకే ఈ ముగ్గురి అకాల మరణం పార్టీని చాలా కృంగ దీసింది.
వాజ్ పేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఎ ప్రభుత్వాలను ఏర్పాటుచేసినపుడల్లా వీళ్లు ప్రభుత్వంలో ఉన్నారు. పార్టీ అధికారం కోల్పోయినపుడు పార్టీ లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. వీళ్లంతా బతికున్నపుడు నాయకత్వం ఎవరిదైనా పార్టీకి ప్రభుత్వానికి తప్పని సరయిన నాయకులు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/this-is-how-jaitley-arrested-after-proclamation-of-emergency-in-1975/
అందుకే వాజ్ పేయి ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించారు, 2014 నుంచి సాగుతున్న మోదీ పాలనతో కూడా కీలకమయిన బాధ్యతలు నిర్వహించారు. అంతా ఆనారోగ్యంతో చనిపోయారు.
ఇది అనంతకుమార్, సుష్మ, జైట్లీలు ఉన్న అరుదైన ఫోటో…
ఇందులో అనంతకుకుమార్ 59వ యేట నవంబర్ 12, 2018లో అనారోగ్యంతో చనిపోయారు. ఆయన అరుసార్లు బెంగళూరు నుంచి పార్లమెంటుకు ఎంపికయ్యారు. సివిల్ ఏవియేషన్ వంటి కీలకమయిన పదవులు నిర్వహించారు. ఒకపుడు ప్రధాని పదవికి వినిపించిన పేర్లలో ఆయన పేరొకటి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
సుష్మా స్వరాజ్ 67యేట ఆగస్టు 9, 2019న చనిపోయారు.రాజకీయాలలో ఫైర్ బ్రాండ్. ఏపదవినైన విజయవంతంగా నిర్వహించగల సమర్థురాలు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్టీ నేత గా ఆమె బిజెపికి వన్నెతచ్చారు. ఇపుడు ఆగస్టు 24, 2019న అరుణ్ జైట్లీ కూడా అనారోగ్యంతో చనిపోయారు.
ఈ నాయకులంతా భారతీయ జనతా పార్టీని మల్టీ స్టారర్ గా మార్చారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/retired-judge-of-ap-high-court-justice-lakshman-reddy-to-become-lokayukta-of-andhra-pradesh/