ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావుకు గుండెపోటుకు గురయ్యారు.
కుటుంబసభ్యులు ఆయననను గుంటూరు గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్ చెబుతున్నారు.
గుంటూరు, విజయవాడ నుంచి ప్రముఖ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నారు.
గతంలోకూడా కోడెల శివప్రసాదరావుకు ఒక సారి గుండెపోటు వచ్చింది. అప్పుడు చికిత్స చేసిన వైద్యులు స్టెంట్ అమర్చారు.
అసెంబ్లీ లోని ఫర్నిచర్ ను సొంత ఇంటికి కుమారుడి షోరూం కూ తరలించారనే ఆరోపణలు ఆయనను చుట్టుముట్టాయి. దీనిని బాగా రభస జరుగుతూ ఉంది. నిన్న ఎవరో ఆగంతకుడు ఆయన ఇంటిలో చొరబడి కంప్యూటర్ ఎత్తుకుపోయారు.
ఇది వైసిపి నేత అంబటి రాంబాబు చేయించనిపనే అని ఆయన ఆరోపించారు. ఆయన స్కిల్ డెవెలప్ మెంటు సెంటర్ కు కేటాయించిన కంప్యూటర్లను కూడా ఆయన ఎత్తుకుపోయారని ఆరోపణ ఉంది.దీని మీద కేసులు కూడా నమోదయ్యాయి.
ఆయన మీద సాక్తి దిన పత్రిక చాలా ఆసక్తి కరమయిన సమాచారం వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీని 2017 మార్చిలో హైదరాబాద్ నుంచి అమరావతికి మారస్తున్నపుడు స్పీకర్ చాంబర్, పేషీకి సంబంధించిన ఫర్నీచర్‌ను సత్తెనపల్లి, నర్సరావుపేటలోని కోడెల ఇంటికి తరలించారని సాక్షి రాసింది.
గతంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి నాదెండ్ల మనోహర్ స్పీకర్‌గా ఉన్న సమయంలో స్పీకర్ చాంబర్, పేషీ కోసం మలేషియా నుంచి ప్రత్యేకంగా ఫర్నీచర్‌ను కొనుగోలు చేశారు. వీటిని 2017లో అమరావతికి తరలించాల్సిఉంది. అయితే కోడెల మాత్రం తన ఇంటికి మళ్లించారని ఈ పత్రిక రాసింది.
ఫర్నీచర్‌తోపాటు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సైతం ఆయన దారి మళ్లించారని ఆరోపణలున్నాయి. దీనిని ఆలస్యంగా గుర్తించిన అసెంబ్లీ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు విషయాలు బయటపడ్డాయని సాక్షి పేర్కొంది. ఈ అక్రమ తరలింపులో సీసీ కెమెరాలను ఆపి వేసి అసెంబ్లీ చీఫ్ మార్షల్ సహకరించి నట్లు ఈ పత్రిక రాసింది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కూడా కంప్యూటర్లు, కొంత ఫర్నీచర్‌ను కోడెల మనుషులు భారీగా తరలించారట.