మాజీ ఆర్థిక మంత్రి,తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్దమయింది.
ఈ వార్త రాస్తున్నప్పటికా ఆయన్ని వెదికి పట్టుకోవాలని కోర్టు లూక్ ఔట్ వారంట్ జారీ చేసింది.
మరొక వైపు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం (కాంగ్రెస్ ఎంపి) కూడా ఇదే కేసులో ఉన్నారు. ఇద్దరిని జైలుకు పంపేందుకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చిదరంబరం కామ్ గా బిజెపిలో చేరిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చే ఉండేది కాదు. అయితే, అలా చేయకపోవడంతో పరిస్థితి తారుమారయింది.
ఆయన, కుమారుడు కార్తీలకు కష్టాలు తెచ్చిన కేసు INX Media case గా పేరు పడింది. ఇంతకీ ఈ కేసేంటో తెలుసా?
దేశంలో భారీగా టివి చానెళ్లు ప్రారంభించేందుకు ఇంద్రాణి ముఖర్జీ అనే పెద్దావిడ INX Media అనే కంపెనీని 2006 లో ప్రారంభించింది.
ఇది కూడా చదవండి :
చిదంబరం చేసిన నేరం ఏమిటి?
(ఇంద్రాణి జీవితం చాలా మలుపులు తిరిగి, కూతురి హత్య దాకా వెళ్లి అంటునుంచి జైలు కెళ్లింది. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కూడా ఆమె తర్వాత అప్రూవర్ గా మారింది.)
అవి యుపిఎ ప్రభుత్వం నాటి రోజులు. 2007లో ఈ కంపెనీ విదేశీ పెట్టుబడులు తెచ్చుకునేందుకు క్లియరెన్స్ ఇవ్వాలని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (FIPB)కి దరఖాస్తు చేసుకుంది.
ఈబోర్డు కేంద్ర ఆర్థిక శాఖ లో పరిధిలో ఉంటుంది. ఈ దరఖాస్తు చేసుకున్నపుడు ఆర్థిక మంత్రి పి చిదంబరం.
2007 మార్చి 18న బోర్డు సమావేశమయింది. INX Media రు. 4.62 కోట్ల విదేశీ పెట్టుబడులు తెచ్చుకునేందుకు బోర్డు అనుమతినిచ్చింది. అయితే, INX Media తన దగ్గిర ఉన్న డబ్బును మరొక కంపెనీ INX News లో డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి అనుమతినీయలేదు. ఇది సిబిఐ చెబుతున్న విషయం. విదేశీ పెట్టుబడులున్న ఒక కంపెనీ మరొక కంపెనీలో పెట్టుబడి పెట్టడమే డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంటు. ఇది పరోక్ష పెట్టుబడి కిందకు వస్తుంది.
సిబిఐ ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం ఎప్ ఐ పిబి అనుమతినీయకపోయినా, నియమాలను ఉల్లంఘించి INX Media (P)Limited డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంటు చేసింది. ఇందులో రెండు అక్రమాలున్నాయన్నది సిబిఐ వాదన.
అవి 1. INX News Private Limited అనే కంపెనీ అక్రమంగా INX Media (P)Limited 26 శాతం ఇన్వెస్ట్ చేసింది. దీనికి అనుమతి లేదు.
2. INX Media (P)Limited కోసం ప్రమోటర్లు నిబంధనలకు వ్యతిరేకంగా రు. 305 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మారిషస్ లోని కంపెనీలనుంచి సేకరించారు. వీళ్లకి అనుమతి ఉండేది కేవలం రు. 4.62 కోట్లకు మాత్రమే. ఈ పెట్టుబడుల సేకరణ కోసం విదేశీపెట్టుబడి దారులకు ఒక షేర్ ధర రు. 800 చొప్పున ప్రీమియం ధరలకు విక్రయించారు.
ఈ రెండు అక్రమాల మీద FIPB 2008లో INX Media కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, FIPB షోకాజ్ నోటీసు రాగానే INX Media కష్టాల్లో పడింది. దీని నుంచి బయటపడేందుకు కార్తి పి చిదంబరం ( ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు)తో చేతులు కలిపింది.
కార్తీ అపుడు మెస్సర్స్ చెస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ , చెన్నై డైరెక్టర్ గా ఉన్నారు. FIPB అధికారులతో మాట్లాడి ఈ విషయాన్ని సెటిల్ చేయమని INX Media కార్తీని కోరింది.
ఆర్థిక మంత్రి చిదంబరం పర్యవేక్షణలో పనిచేసే ఎఫ్ ఐ పిబి 305 కోట్ల విదేశీ పెట్టుబడుల మీద చర్య తీసుకోకుండా, వీటికి అనుమతి కోసం తాజాగా దరఖాస్తుచేయాలని ఐఎన్ ఎక్స్ మీడియా కు సూచించింది.ఇది నేరం అని ఇడి,సిబిఐ వాదిస్తున్నాయి
ఇందులో క్రిమినల్ కాన్ స్పిరసీ ఉందని సిబిఐ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంది.
క్రిమినల్ కాన్ స్పిరేసీ ఏమిటంటే కార్తీ చిదంబరం తన ‘పలుకుబడి’ ఉపయోగించి INX Media విదేశీపెట్టుబడులు నియమాలను ఉల్లంఘించిందన్న విషయాన్ని చూసీచూడనట్లు పోవాలని FIPB ని ఒప్పించాలి.
ఈ పని చేసినందుకు కార్తి చిదంబరం నడుపుతున్న మెసర్స్ స్ట్రటెజిక్ కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీకి భారీగా ముడుపులు చెల్లించారని సిబిఐ ఆరోపణ. ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా అక్షరాాలా పది లక్షల రుపాయలు.
INX Media ఈ భారీ మొత్తాన్ని అంటే రు. 10 లక్షలను మెసర్స్ అడ్వాంటేజ్ స్ట్రటెజిక్ కన్సల్టింగ్ కు కన్సల్టెన్సీకి ఫీజుకింద ఇచ్చినట్లు రికార్డులలో రాసుకున్నారని సిబిఐ పేర్కోది.
సిబిఐ దీనికి గురించి ఇలా రాసింది: “Payment was delibrately made to M/S Advantage Strategic Consulting(P) Limited, ుndirectly డontrolled by Karti P Chidambaram for the services rendered by M/S Chess Management Services (P) Limited where Karti Chidambaram was the promoter diretor.
https://trendingtelugunews.com/amit-shah-arrest-chidambaram-arrest-by-cbi-a-comparision/