[ajax_load_more post_type=”post, page” post_format=”standard” pause=”true” scroll_distance=”6″ max_pages=”6″ progress_bar=”true” progress_bar_color=”ed7070″]
అమరావతి ఎమవుతుందన్న అనుమానాలను వైసిపి ప్రభుత్వం నివృత్తి చేసింది. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి చాప్టర్ క్లోజ్ అని ప్రకటిచింది.ముఖ్యమంత్రి జగన్ మనసులో రాజధాని గురించి ఏముందో బయటపడింది.
రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదని పై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ పట్టణంలో చాలా స్పష్టమయిన ప్రకటన చేశారు.
నిజానికి ఆయన ముఖ్యమంత్రి జగన్ మనసులోని మాటను బయటపెట్టారు. జగన్ అమెరికాలో ఉన్నపుడు ఈ విషయం బయటపట్టారు కాబట్టి, ఆయన అనుమతి ఉంటుందనుకోవాలి. రాజధాని ప్రాంతం సురక్షితం కాదని తేలింది . శివరామకృష్ణన్ కమిటీ నివేదిక లో చెప్పింది వాస్తవమేనని ఇప్పుడు అనిపిస్తోంది. దీనిమీద మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉంది: బోత్సా సత్యానారాయణ
మామూలు ప్రాంతాల్లో ఒక నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చయితే అమరావతిలో రెండు లక్షలు అవుతుంది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. అక్కడ వర్షాలు వస్తే అంతా మునిగిపోతుంది. అక్కడ కట్టే రాజధాని భద్రత కోసం మళ్లీ వేరుగా కాల్వలు తవ్వాలి, డ్యామ్లు కట్టాలి. వరద నీటిని కింది నుంచి ఎత్తిపోయాలి. వీటన్నంటిని దృష్టిలోపెట్టుకుని రాజధాని నిర్మాణం మీద ప్రభుత్వంలో చర్చ జరుగుతూ ఉంది: బోత్సా
అమరావతిపై త్వరలోనే మా విధానాన్ని ప్రకటిస్తాం: బొత్స