భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన బాబా సాహెబ్ అంబేడ్కర్ కాశ్మీర్ కుస్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్ని రాజీ లేకుండా వ్యతిరేకించారు.
భారతదేశం మొదటి న్యాయ శాఖ మంత్రి కూడా అయిన డా.బాబా సాహెబ్ రాజ్యాంగంలో అర్టికల్ 370 చేర్చడానికి ఆయన అంగీకరించలేదు. ఆయన ఎంతగా వ్యతిరేకించిరాంటే తన చేతులతో ఈ అర్టికిల్ ను రాయలేనని ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు స్పష్టం చేశారు.
అర్టికల్ 370ని రాజ్యాంగంలో చేరిస్తే భారత్ పాకిస్తాన్ల మధ్య వైరం శాశ్వతమవుతుందని,యుద్ధాలు అనివార్యమవుతాయని ఆయన చెప్పారు.
గత 73 సంవత్సాలర చరిత్ర చూస్తే అంబేడ్కర్ హెచ్చరించింది నిజమయిందని పిస్తుంది.
1947 నుంచి 1952 దాకా సాగిన జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం తాత్వాలిక ప్రభుత్వమే. ఇందులో ఇద్దరు కాంగ్రెసేతర మేధావులున్నారు. వారు డాక్టర్ అంబేడ్కర్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఇద్దరు ఆర్టికల్ 370 విషయంలో నెహ్రూను వ్యతిరేకించారు.
కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తినిచ్చే అధికరణాన్ని రాసేందుకు,రాజ్యాంగంలో చేర్చేందుకు అంబేడ్కర్ రస్కరించినపుడు నెహ్రూ ఆపనిని మరొక మంత్రి గోపాల స్వామి అయ్యంగార్ కి అప్పగించారు.
ఆయన నెహ్రూ క్యాబినెట్ లో శాఖ లేని మంత్రి. అంతకు ముందు ఆయన కాశ్మీర్ లో హరిసింగ్ ప్రిన్స్ లీ స్టేట్ కి దివాన్ గా పనిచేశారు. నెహ్రూకు బాగా నమ్మిన బంటు.అందుకే క్యాబినెట్ లో పోర్టు పోలియో లేని మంత్రిగా కొనసాగారు.
ఆర్టికల్ 370 మొదటి రూపం అర్టికల్ 306A. భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు ముప్పు తెస్తుందని చెబుతూ ఆర్టికల్ 306Aని రాజ్యాంగంలో చేర్చేందుకు అంబేడ్కర్ నిరాకరించారు.
ఫిబ్రవరి 21, 1948న డాక్టర్ బాబా సాహెబ్ నాయకత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటి రాజ్యంగం ముసాయిదా కాపీని అప్పటి రాజ్యాంగ సభ (Constituent Assembly) చెయిర్మన్ అయిన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ సమర్పించింది.
ఇందులో కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తినించే అర్టికల్ (370 లేదా 306A)వూసే లేదు. రాజ్యంగాంలో రెండు అంశాలను చేర్చాలని నెహ్రూ పట్టుబట్టారు. అవేవంటే కాశ్మీర్ క స్వయం ప్రతిపత్తి, షేక్ అబ్దుల్లాకు కాశ్మీర్ ప్రధాని పదవి. డాక్టర్ బాబా సాహెబ్ కుదరదని చెప్పారు.
భారతదేశం అపుడే స్వాతంత్య్రం పొంది నిలబడే ప్రయత్నం చేస్తున్న సున్నితమయిన సమయంలో ఒక ప్రిన్స్ లీ స్టేట్ కు ఇలాంటి ప్రత్యేక హోదా ఎందుకీయాలని ఆయనప్రశ్నించారు.
ఆయన ఒకటే ప్రశ్న వేశారు. ‘ మీ కాశ్మీర్ ని ఇండియా కాపాడాలంటారు. మీ ప్రజలకు ఇండియా తిండిపెట్టాలి. కాశ్మీరీలకు భారతదేశమంతా సమాన హక్కులు కావాలంటారు. మరి మీ రేమో ఇండియాకు, ఇండియన్లకు కాశ్మీర్ లో కాశ్మీర్ లో హక్కులీయమంటున్నారు. నేనీదేశానికి న్యాయ శాఖ మంత్రిని. జాతీయ ప్రయోజనాలకు ద్రోహం చేసే నిర్ణయానికి నేను భాగస్వామిని కాలేను’ అని చాలా కచ్చితంగా చెప్పేశారు.
కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తినిచ్చేందుకు అంబేడ్కర్ సుముఖంగా లేడని తెలిసి ఆయనను వప్పించేందుకు షేక్ అబ్దుల్లాను నెహ్రూ ఆయన దగ్గరికి పంపించారు. అబ్దుల్లాతో అంబేడ్కర్ చెప్పిన మాటలు
“Mr. Abullah, You want India should defend Kashmir. You wish India should protect your borders, she should build roads in your area, she should supply you food grains, and Kashmir should get equal status as India, but you don’t want India and any citizen of India to have any rights in Kashmir and Government of India should have only limited powers. To give consent to this proposal, would be a treacherous thing against the interest of India and I, as a Law Minister of India, will never do. I cannot betray the interests of my country.” (Dr BR Ambedkar, Framing Of Indian Constitution, Page 472)
దీనితో ఇక అంబేడ్కర్ ను ఒప్పించలేమని తెలిసి అర్టికల్ 370 ముసాయిదా తయారుచేసే బాధ్యతలను నెహ్రూ ఎన్ గోపాల స్వామి అయ్యంగార్ కి అప్పగించారు. 1949 మే 27న అయ్యంగార్ ఈ అర్టికల్ ముసాయిదాను రాజ్యాంగ సభలో ప్రతిపాదించారు. రాజ్యాంగ సభకు జమ్ము కాశ్మీర్ నుంచి నలుగురు ప్రతినిధులను ఎంపికచేసేందుకు ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఇందులో పొందుపరిచారు.
ఈ నలుగురి పేర్లను తర్వాత డెహ్రూడూన్ లో మకాం వేసి ఉన్న మహరాజా హరిసింగ్ కు పంపించారు. తర్వాత రాజ్యాంగ సభకు ఈ ప్రతినిధులను మహారాజా నామినేట్ చేశారు. వారి పేర్లు: మీర్జా మొహమ్మద్ అఫ్జల్ బేగ్, మౌలానా మొహమ్మద్ సయెద్ మసూది, మోతీరామ్ బైగరా, జమ్ము కాశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా. వీళ్లంతా జూన్ 16,1049లో సభలో సభ్యులయ్యారు.
ఈ నలుగురు సభ్యలతో సంప్రదించి గోపాలస్వామి అయ్యంగార్ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తినిచ్చే అర్టికల్ 306A ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు.
అక్టోబర్ 17, 1949న ప్రధాని నెహ్రూ ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు. అందువల్ల ఈ అర్టికల్ ప్రతిపాదనను పాస్ చేసే బాధ్యత అయ్యంగార్ కి అప్పగించారు. ఈ ప్రతిపాదనని రాజ్యాంగలో చేర్చడానికి ప్రముఖ ఉర్దూ కవి మౌలనా హజ్రత్ మోహాని వ్యతిరేకించారు. ఈ ఆర్టికల్ కు సంబందించిన మోషన్ ను ప్రతిపాదించడం, ఆమోదించడం ఒకే రోజున ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే, మౌలానా కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని వ్యతిరేకించలేదని ఆయన దేశంలో చాలా ప్రాంతాలకు ఇలాంటి హక్కు ఇవ్వకుండా ఒక్క కాశ్మీర్ కే ఈ హెదా కల్పించినందుకు డిసెంట్ తెలిపారని కొందరు చెబుతారు.
సభలో జరుగుబోతున్న తతంగం డా. అంబేడ్కర్ కు నచ్చ లేదు.
306A మారి పోయి 370 అయింది
ఆందుకే 306A రాజ్యాంగంలో చేర్చే ప్రతిపాదన సభ ముందకు వస్తున్న రోజున ఆయన సభకు హాజరు కాలేదు.ఆ మోషన్ ఏకగ్రీవంగా పాసయిందా? కాలేదు. ఒకే ఒక సభ్యుడు- హస్రత్ మౌలానా మొహాని వ్యతిరేకించారు. తర్వాత 306A ని 370 అర్టికల్ గా రీ నెంబరింగ్ జరిగింది.
అర్టికల్ పాసయ్యాక కూడా అంబేడ్కర్ ఈ ప్రొవిజన్ ను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ మ్యానిఫెస్టోలో ఆయన ఈ రాజ్యాంగ ఏర్పాటు కొనసాగితే, భారత్ పాకిస్తాన్ ల మధ్య శాశ్వత శత్రుత్వ ఏర్పడుతుందని, అది యుధ్దాలకు కూడా దారితీస్తుందని 1951లో రాశారు. అదే జరిగింది. పాకిస్తాన్ తో భారత్ శత్రుత్వం పెరిగింది. మూడు యుద్ధాలు నడిచాయి.
నెహ్రూకు బాగా సహకరించిన గోపాల స్వామి అయ్యంగార్ తర్వాత భారత రక్షణ మంత్రి అయ్యారు.1952-52 బడ్జెట్ లో కాశ్మీర్ వివాదం పరిష్కారానికి రు. 50 కోట్లు కేటాయించడాన్ని కూడా అంబేడ్కర్ వ్యతిరేకించారు.
అంతేకాదు, కాశ్మీర్ ప్రాబ్లమ్ పరిష్కారం కావడానికి 370 అధికరణాన్ని రద్దు చేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. నెహ్రూ, అయ్యంగార్ దానిని పట్టించుకోలేదు.
1951-52 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నపుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా అంబేద్కర్ విధానాన్నే అనుసరించారు.
డాక్టర్ అంబేడ్కర్ 370 ఆర్టికల్ ను వ్యతిరేకించడం, దీనిని రద్దుచేస్తున్నపుడు బిజెపికి బాాగా పనికొచ్చింది. కాంగ్రెస్ తో పాటి, ఇతర వ్యతిరేకులందరిని ఎదుర్కొనేందుకు బిజెపి అంబేడ్కర్ ని మంచి ఆయుధంగా వాడుకుంది.