మతం,కులం, ప్రాంతం,భాషా,ధనిక,పేద అనే భేదం లేకుండా బ్రతుకుతున్న చిన్నలకి పేద్ద లకి నా నమస్కారాలు.ముందుగా మనమంతా భారతీయులం అంతకు మించి మానవత్వం ఉన్న మనుషులము. స్వతంత్రం అంటే ఏమిటో ఎవరైనా ఒక్కమాట లో వివరించగలరా…స్వతంత్రం అంటే. ..అదో..ఇదో.మరేదో కాదు…”నీ హక్కు ను నువ్వు పొందటం.ఆ హక్కు ను అనుభవించడం. పరాయి వ్యక్తుల పాలన నుండి, పరాయి వ్యవస్థల ఆధీనం నుండి మీ జీవితాలు స్వేచ్చ పొంది…మీకు నచ్చినట్టు…మీకు నచ్చినచోట మీరు జీవించటమే నిజమైన స్వాతంత్య్రం
ఇక్కడ మనకి మనం కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకుంటే. …?
》స్వాతంత్య్రం ఎందుకోసం సాధించుకున్నాము 》స్వాతంత్య్రం యొక్క ఆవశ్యకత ఇపుడు ఉన్నదా 》స్వాతంత్ర్యానికి మనం తగినంతగా గుర్తింపు ను ఇస్తున్నామా 》స్వాతంత్య్రం యొక్క రూపురేఖల ప్రస్తుత పరిస్థితి ఏమిటి 》భావి భారత పౌరులు స్వాతంత్య్ర సమరాన్నీ ఆదర్శంగా తీసుకుంటున్నార 》దేశభక్తి ని ఎంత మంది తల్లితండ్రులు,ఉపాద్యాయులు తమ పిల్లలకు నేర్పుతున్నారు.
🚩 ఇపుడు ప్రస్తావించే విషయాలు నా స్థాయి కి మించి ఉండొచ్చుగాక,అలాగే ఈ విషయాలు కూడా మీకు చిన్న గా కనిపించవచ్చును.అంతే కాకుండా అనవసరంగా కూడా అనిపించ వచ్చును.
🚩 దేశమును ప్రేమించుమన్నా/ మంచియన్నది పెంచుమన్నా/చెట్టపట్టాల్ పట్టుకుని/దేశస్థులంతా నడవలేనోయ్/అన్నదమ్ముల వలెను జాతులు/మతములన్నీ మెలగవలేనోయ్. ..అని గురజాడ అప్పారావు గారి గేయాన్ని ఎంత మంది ఆదర్శంగా తీసుకుని అమలుపరుస్తున్నారు. దీన్ని అమలు పరిస్తే నిజంగా జాతికి స్వేచ్చ స్వాతంత్ర్యాలు వచ్చినట్టే కదా.
🚩 అలాగే ఏ దేశమేగినా ఎందుకాలిడినా/ ఏ పీఠమేక్కినా ఎవ్వరేమనినా/పోగడరా నీ తల్లీ భూమి భారతిని / నిలపరా నీ జాతి నిండు గౌరవమును…అన్న రాయప్రోలు సుబ్బారావు గారి గేయాన్ని పిల్లల మనస్సు ల్లో నిలిపితే అంతకన్నా ఈ దేశానికి ఇంకేమి కావాలి.నిజాయితీ. . నిర్భయాన్నీ కళ్లల్లో నింపుకున్న పిల్లలే కదా రేపటి స్వేచ్ఛా స్వాతంత్ర్యలకు మూలస్తంభాలు గా ,ధివిటీలుగా నీలుచునేది.
🚩స్వేచ్ఛ స్వాతంత్రం లేని జీవితం ….మరణంతో సమానం కదా ! ఉద్యోగం కోసం కాదు తెలివి కోసం చదవాలి పత్రికలు-పుస్తకాలు అన్నింటిని విరివిగా చదవండి.. చదివించండి., ఎవని ఎదుట వంగి వంగి సలాములు కొట్టే అవసరం ఉండకూడదు మిత్రమా .
🚩చదువుకుని జీతగాడిగా మారిపోతారో, బ్రతుకు పాఠం నేర్చుకుని పది మంది జీవితాలకు యజమానిగా, మార్గదర్శకులుగా అవుతారో నిర్ణయించుకోండి. నేను భూమ్మీద శ్వాస పీల్చుకునే సమయానికి దేశంలో ఆర్థిక సంస్కరణలు స్వేచ్ఛా స్వాతంత్రాలకు పంచనామా ను అంతిమ స్థాయిలోకి తీసుకొచ్చి పెట్టారు.
🚩75 శాతం నిరక్షరాస్యుల మీద 25 శాతం అక్షరాస్యులు, 90శాతం దరిద్రుల మీద 10 శాతం ధనవంతులు పరిపాలన సాగిస్తున్న వ్యవస్థా గా మారిపోయింది.ఇ దే ప్రజాస్వామ్యం అని అనుకోవడం అంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఈ వ్యవస్థను మార్చాలనిఏ లిగెత్తీ చెప్పడం కన్నా ఇంకో ఉన్నత ధర్మం ఏ సాహిత్యపరుడి కైనా,డ్శభక్తుడికైనా, విద్యార్థికైనా, నిజమైనా జర్నలిస్టుకైనా ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు .ఈ వ్యవస్థకి రకరకాలుగా కొమ్ముకాసే రాతగాళ్లు,నేతగాళ్లు లంతా ప్రజాద్రోహులు దేశద్రోహులే కదా! స్వాతంత్రం ఇందుకోసమేనా సాధించుకున్నది.
🚩కారు మబ్బులు విడిపోతున్నాయి భ్రమలు తొలగి పోతున్నాయి ఆశలు అడుగంటి పోతున్నాయి ప్రపంచ సమీకరణలు మారిపోతున్నాయి ప్రపంచీకరణ వలన జాతులు, సంస్కృతులు, జంతు జీవాలు ప్రమాదంలో పడుతున్నాయి. గ్లోబలైజేషన్ వలన పర్యావరణం తీవ్రాతి తీవ్రంగా దెబ్బ తింటూ వస్తున్నది. పరిశ్రమల వలన గాలి కాలుష్యం ,జల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. డిల్లీ లాంటి పట్టణాలలో గాలి కూడా పీల్చుకోనీ పరిస్థితులున్నాయి. ఆనాటి గ్రామీణ ప్రాంతాలలోని స్వయంప్రతిపత్తి కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పట్టణాలలోజనాభా విస్పోటనం సరిదిద్దలేనంత స్థాయికి చేరిపోయింది. ఇందుకోసమేనా ప్రపంచ దేశాలు బానిస సంకెళ్ళు తెంచుకుని స్వాతంత్రం సాధించుకుంది.
🚩 దేశ కాలములు గమనించండి .ఈర్ష ద్వేష భావములు పారద్రోలండి. సోదర సోదరీమణుల వలే బ్రతకండి. మేలగనీయండి. స్వేచ్ఛా స్వాతంత్రం కంటే ప్రస్తుతం నైతిక విలువల కోసం పోరాడాలి. అందరి దగ్గర డబ్బు , హోదా ఉంది కానీ మానవతా పరిమళాలు ఎండిపోతున్నాయి.
🚩మేధావులారా… చదువుకున్న విఙ్ఞానులారా…. భావి భారత పౌరులకు ఏలాంటి సమాజాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఒక్క సారి వీటిని పరిశీలించండి ..తల్లిపాల నుంచి తారలోకం వరకు కల్తీ చేస్తు ఆధిపత్యం కొరకు అంత్యర్యుధ్ధం చేస్తు అడ్డదారులు తొక్కుతున్న వ్యక్తులు ,వ్యవస్థ ల కోసమా స్వాతంత్రం వచ్చింది.
🚩ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారులు తమ అక్రమ ఆదాయాలను ప్రపంచదేశాలకు తరలించి దాచుకోవడానిక స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించుకున్నది. సప్తవ్యసనాలకు లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వమే ఆ కేంద్రాలను నడిపి ప్రజలను వ్యసనాలకు బానిషలను చేయడానికా స్వాతంత్రం తెచ్చుకున్నది.
🚩అసలు స్వాతంత్ర్యం రావడానికి మొదట గా ప్రయత్నించింది “ఆదివాసీలు” కదా.అలాంటి ఆదివాసిలు నేడు నిలువ నీడలేకుండా నిర్బంధంగా మైదాన ప్రాంతాలకు తరలింప బడుతున్నారు. ఈ విధంగా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే తెల్ల దొరల పాలనను నల్ల దొరల చేతిలో పెట్టేవారు కాదేమో మరి .
🚩సామాజిక కార్యకర్తలు, నిజాయితీగల జర్నలిస్టులు, సమాచార చట్టం కార్యకర్తలు, ప్రముఖ రంగాలలోని సాంఘిక సంస్కర్తలు వాక్ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. విచిత్రం.. ఈ మధ్యకాలంలో వాక్ స్వాతంత్రం కోసం గళంమెత్తిన వారు, కలం పట్టిన వారు హత్యగావింప బడుతున్నారు. ఇదేనా స్వతంత్రం అంటే.
🚩చదువు వలన, ఉద్యోగాల వలన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభిస్తాయి అంటే అది తెలివైన మూర్ఖత్వంగా పేర్కొనవచ్చును. కారల్మార్క్స్, భగత్సింగ్, చేగువేరా, నెల్సన్ మండేలా, అల్లూరి సీతారామరాజు ఏమి చదివారని స్వాతంత్రం కోసం పోరాడారు. రాబోయే తరాలలో నిలువెల్లా స్వార్థం పేరుకుపోతుందనీ తెలిసీ ఉంటే ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్రం కోసం పోరాడే వారు కాదు. స్వాతంత్రం అసలు తెచ్చేవారు కాదేమో. ఏదేమైనప్పటికీ అంతిమంగా చెప్పేదొకటే ప్రకృతి మానవ అవసరాలు తీరుస్తుంది కానీ మానవుడి గొంతెమ్మ కోరికలు తీర్చలేదు ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ తన చరిత్రను బంగారు పత్రం లో లిఖించుకుంటూ పొతే ఆఖరికి మానవుడికి మిగిలేది స్వాతంత్రము కాదు నిర్మానుష్యమైన శూన్యం.