బంగారు ధరలు ఇంకా పెరబోతున్నాయి. గోల్డమన్ శాక్స్ గ్రూప్ బంగారు భవిష్యత్తు అంచనాలను (Gold Forecast) పైపైకి పెంచింది.ఈ గ్రూప్ ఇలా చేయడం ఈ ఏడాది ఇదే మొదటిసారి.
అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యం బంగారు ధరలు బాగా పెరుగుతాయని, వచ్చే మూడు నెలల్లో ఔన్స్ ధర 1575 డాలర్లు, ఆరునెలల్లో 1600 డాలర్లు దాటవచ్చని పేర్కొంది.
సోమవారంనాడు బంగారు ధర స్థిరంగా 1500 డాలర్ల దగ్గిర నిలబడింది. ఈ స్థాయికి చేరడం 2013 తర్వాత ఇదే ప్రథమం. గతవారంలో బంగారు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 4 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల అక్కడ ఆగిపోలేదని, ఇంకా దూసుకుపోతుందని గోల్డ్ మన్ చెబుతూ ఉంది.
చైనా కరెన్సీ యువాన్ (CNY) బలహీనపర్చడంతో అమెరికాతో పాటు ప్రపంచ వ్యాపింత వాణిజ్యభయాలు పట్టుకున్నాయి. ఎందుకంటే, ఈ చర్యతో చైనా సరుకులు చౌక అయిపోతాయి. అమెరికా సరుకులు ప్రియమవుతాయి. అర్థిక ప్రగతి మందగిస్తే ప్రభుత్వ బాండ్లలో రాబడి తగ్గిపోతుంది. దీనితో ఇన్వెస్టర్లు బంగారు వైపు మళ్లుతారు. అందువల్ల మా గోల్డ్ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటున్నామని గోల్డమన్ విశ్లేషకులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో గోల్డ్ మన్ శాక్స్ ఈ ఏడాది 3, 6, 12 నెలలకు బంగారు ధరలు ఔన్స్ కు 1450, 1475, 1475 డాలర్లనిప్రకటించింది. దీనిని ఇపుడు 1575,1575, 1600 డాలర్లని ప్రకటించింది.
మంగళవారం మార్కెట్
మంగళవారం నాడు గోల్ల్ ధర 0.3శాతం పెరిగి ఔన్స్ ధర1515.21 డాలర్లకు చేరింది.
ఫ్యూచర్స్ గోల్డ్ ఔన్స్ ధర 0.5 శాతం పెరిగి 1525.10 డాలర్లు పలికింది.
సోమవారం నాడు ఇండియాలో పదిగ్రాముల బంగారం ధర (ఢిల్లీలో) రు. 50 పెరిగి రు. 38,470కి చేరింది.
ఫోటో కిట్కో నుంచి