రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ ఏంది?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ పరిపాలన పులివెందుల పంచాయతీ లాగా జరపాలనుకుంటే ఒప్పుకోమని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి జగన్ ను హెచ్చరించారు. ఈ రోజు విజయవాడలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నిలక ఫలితాల విశ్లేషణ చేశారు.అలాగే పరిపాలన తీరు గురించి మాట్లాడారు.
రాష్ట్రంలో పరిపాలన పులివెందుల పంచాయతీలాగా ఉందని, చివరకు వాకౌట్ చేస్తున్నామని ప్రకటించేందుకు కూడామైకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. దీనిని సాగనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
గోదావరి నీళ్లను తెలంగాణకు తరలించుకుపోయేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఉన్న నీళ్లు తీసుకుపోయి  రాయలసీమకు నీళ్లిస్తామని చెప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు.
గ్రామ వాలంటీర్ల నియామకంలో వైసిపి కార్యకర్తలకే అవకాశం ఇస్తున్నారని, గ్రామ, అర్బన్ వాలంటీర్ల రూపంలో కార్యకర్తలకు తీసుకుని ప్రభుత్వం నుంచి  జీతాలిస్తున్నారని ఆయన అన్నారు.
ఆయన  ఇంకా ఏమన్నారంటే…
ఓటింగ్ శాతం పెరిగినా, మనం గెలవలేకపోయాం.సీట్లు, ఓట్లు సంఖ్య తగ్గడం పై సమీక్ష చేసుకోవాలి.రాజకీయ పార్టీల పైన దాడులు చేయడం నీచం,దుర్మార్గం. నెల్లూరులో ఉన్న ఇళ్ళలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ళు మూడు ధ్వంసం చేశారు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/pawak-kalyan-asks-why-nellore-ycp-mla-kotamreddy-was-not-booked/

భౌతిక దాడులు 170 జరిగాయి, ఆస్తుల విధ్వంసం చేశారు.సోషల్ మీడియాలో పోస్టింగుల పై కేసులు పెట్టారు.టిడిపి సానుభూతిపరులు, కార్యకర్తలు ఊళ్ళు వదిలి పెట్టి వెళ్లే పరిస్ధితి వచ్చింది
ఇంత విధ్వంసకర కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు.కేసులు పెట్టినపుడు టిడిపి వారి పై నాన్ బెయిలబుల్ కేసులు పెడ్తున్నారు.వైసిపికి ఓటు వేయకపోతే క్షమాపణలు చెప్పాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. టిడిపి కూడా వైసిపిలాగా పనిచేస్తే మీరు గ్రామాలు, ప్రాంతాలు వదిలి పెట్టి వెళ్ళేవారు
ప్రజావేదికను కూల్చేశారు.రాజధాని ఏరియాలో ఒక కమ్యూనిటీ హాలు కానీ మీటింగ్ హాలు కానీ లేదు
టిడిపిని భయభ్రాంతులకు గురిచేస్తే భయపడతారనే భ్రమలో ప్రభుత్వం ఉంది. ఇదే పోలీసులు టిడిపి ప్రభుత్వంలో కూడా పనిచేశారు.రాష్ట్రంలో అరాచకాలు చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుంది
‘మేము 151మంది ఉన్నాం మీరేం చేయగలరంటూ బెదిరిస్తున్నారు’.
దాడులు పై మాట్లాడటానికి అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు.టిడిపి వారికి మైకులు ఇవ్వకుండా అసెంబ్లీని నడిపించారు.టిడిపి ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీలు బలంగా పోరాడారు
కౌన్ కిస్కా తెలుగుదేశం వాళ్ళు అని స్పీకర్ సీతారాం అవమానించారు.డెబ్భై మూడు రోజుల ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారు.టిడిపి హయాంలో ఫ్రీగా ఇసుక ఇస్తే, ఇప్పుడు రేటు కట్టి మరీ పెంచారు.భవన కార్మీకులకు ఉపాధి లేకుండా పోయింది.
సిమెంటు కంటే ఇసుక రేటు ఎక్కువగా ఉంది.పేదవారి కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు మూసేశారు.పేదవాడికి అన్నం పెట్టడంలో కూడా వివక్ష చూపిస్తున్నారు.