కర్నూలు నగరానికి వరద ముప్పు తప్పింది. నిన్న తుంగభద్ర వరద పరవళ్లు తొక్కుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తయి కర్నూలులో హై అలర్ట్ ప్రకటించారు. అయితే,
ఈరోజు వరద ప్రవాహం తగ్గింది. నిన్న శ్రీశైలం రిజర్వాయర్ లోకి ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు దాటే సూచనలు కనిపించడంతో ప్రజలను అమ్రమత్తం చేశారు. పరిస్థితి 2009 నాటి వరదలను గుర్తు చేసింది.
2009లో తుంగభద్ర డ్యాం నుంచి నదిలోకి కర్నాటక వరద నీటిని వదలడంతో కర్నూలు వరదల్లో మునిగిపోయింది. సగం వూరిని తుంగభద్ర నీరు ముంచెత్తింది.ప్రజలంతా ఖాళీ చేయాల్సి వచ్చింది.
నాటి చేదు అనుభవాలు గుర్తుకొచ్చేలా మళ్లీ నిన్న అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
అయితే వరద తగ్గు ముఖం పట్టిందని కర్నూలు ఎంపి డాక్టర సంజీవ్ కుమార్ తెలిపారు. వరద ప్రవాహం తగ్గడంతో పాటు శ్రీశైలం రిజర్వాయర్ లో నీటిమట్టం కూడా తగ్గిందని ఆయన చెప్పారు.
నిన్నటి పరిస్థితి
కర్నాటకలో భారీగా వర్షం కురుస్తూండటంతో తుంగభద్రలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తుంగభద్ర బోర్డు అధికారులు కర్నూలులోని లో తట్టు ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది లో తట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలన్నారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/kannada-actor-to-launch-protest-against-jagans-75-pc-job-reservations-for-andhras/