స్వాతంత్య్రదినోత్సవం నాడు జండాలు కొనడం, పిల్లలకు కొనిపించడం అందరికీ అలవాటే.
ఆ రోజు చిన్నచిన్న జండాలు లక్షల్లో అమ్ముడు పోతాయి. అయితే, ఇవన్నీ చాలా వరకు ప్లాస్టిక్ తో చేసినవే. అవి పర్యావరణానికి హాని చేస్తాయి. పండగ సంబరాలలో పడిపోయిన మనకు ఈ విషయం గుర్తండనే ఉండదు.
సెంటిమెంట్లే మనల్ని నిడిపిస్తాయి. ఇది చాలా బాధ్యతారహితంగా ఉంటుందంటే ఎవరూ బాధపడాల్సిన పనిలేదు. ఆగస్టు 15 రాత్రికల్లా మన జండాలను మనమేలా చెత్తలో పడేస్తామో మనపట్లించుకోం. రాఖీ పండగ మరుసటి రోజు మన ప్లాస్లిక్ రాఖీలమయ్యోయో మనకు అనవసరం. ఇదే గ్రీటింగ్ కార్డులకు, బిజినెస్ కార్డులకు వరిస్తుంది.
సెంటిమెంట్లతో జరుపుకునే సెలెబ్రేషన్స్ బాధ్యతారహింతంగా ఉండటంతో కోట్లాది టన్నుల పాస్లిక్ చెత్త తయారువుతూ ఉంది.
ప్రతియేడాది స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా ముగుస్తుంది.వూరూర, వాడవాడలా స్వాతంత్య్రవేడుకలు సాయంకాలనికి ముగుస్తాయి. ఒక లెక్కప్రకారం ఈ వేడకలు మిగిలించే ప్లాస్టిక్ చెత్త దేశానికి భారమవుతూ ఉంది.
ప్రతియేటా సుమారు 50 వేల టన్నలు ప్లాస్టిక్ జండాలు చెత్తలో చేరుతున్నాయి. వీటిని వదించుకోవడం చాలా కష్టం. అలా వదిలేస్తే అవి మురుగు కాలువలనుంచి చెరువుల దాకా విస్తరించి పర్యావరణాన్నినాశనంచేస్తున్నాయి. అలాగాని వాటిని కాల్చేస్తే విషవాయువులు వెలవడి మనుషులకు హాని చేస్తాయి.అందకే గత కేంద్ర హోం శాఖ కూడా ప్లాస్టిక్ జండాలను వాడవద్దని సలహా ఇచ్చింది.
అందుకే చాలామంది ఈ ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ ని, రాఖీ సెలబ్రేషన్స్ ని, ఇతర అన్ని రకాల సెలెబ్రేషన్స్ ని ఒక మంచి జ్ఞాపకంగా పదిలపర్చాలనుకుంటున్నారు. కొత్త రకం జండాలను, రాఖీలను, గ్రీటింగ్ కార్డులను, క్యారీ బ్యాగ్ లను తయారుచేయాలనుకుంటున్నారు రోషన్ రే (seed paper india), కార్తీక సక్సేనా, దివ్యాంశు ఏసోపా (21Fools) లాంటి వాళ్లు.
మీరలా కుండిలో పడేసినా ఈ జండాలు, రాఖీలు, క్యారీ బ్యాగ్ లు మొలెకెత్తి పూలచెట్లవుతాయి. పళ్ల చెట్లవుతాయి.
రోషన్ రే స్థాపించిన సీడ్ పేపర్ ఇండియా అనే స్టార్టప్ తయారుచేస్తున్న జండాల లో కెమికల్ కలర్స్ వాడరు. జండాలో ఉన్నరంగులన్నీంటిని పసుపు, నేరేడు, ఆకుకూరల నుంచి తయారుచేసినవే. అంటే ఈ జండాలో సింధెటిక్ పదార్థమనేది ఉండదు. జండాలను తులసి,టోమాటో, ఆకుకూరల వంటి విత్తనాలతో తయారుచేస్తారు. ఈ జెండాలోని విత్తనాలు నాటిన వారం రోజుల్లో మెుక్కలవుతాయి.
ఇలా ఎకో ఫ్రెండ్లీ జెండాలను తయారుచేస్తున్న మరొక వ్యక్తి ఢిల్లీకి చెందిన కృతిక సక్సేనా. అమెకూడా రకరకాల మొక్కల విత్తనాలతో, టొమాటొ, చిల్లీ వంటి కూరగాయల విత్తనాలతో జండాలను తయారుచేస్తున్నారు.బయో టెక్నాలజీ ఇంజనీర్ లయిన కార్తీక ఇప్పటి దాకా 85 వేల జండాలను విక్రయించారు. ప్రతి 2×3 అంగుళాల జండాలో 70 విత్తనాలుంటాయి.
వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఆమె తన జండాలకు ప్రచారం చేస్తున్నారు. కృతిక జండాలకు సప్లయిచేయలేనంతగా డిమాండ్ పెరిగింది. అర్డర్లు ఉత్తరాఖండ్, హైదరాాబాద్, ముంబయి లనుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయ్.
ఆమెజండాను అరురుపాయలకొకటి చొప్పున అమ్ముతున్నారు. బయట అర్గానిక్ అంటేనే కొనలేనంత ప్రియంగా ఉంటాయి. అయినా సరే ఆమె జండాధర ఆరురుపాయలుగా నిర్ణయించారు. జెండాలతో పాటు రాకీలు, గ్రీటింగ్ కార్డులు, సీడ్ బాంబులను తయారుచేస్తున్నారు. సీడ్ బాంబులంటే..రీసైకిల్ చేసిన కాటన్ ఉండలో విత్తనాలనునింపడం. వీటిని ఎక్కడయి నిర్జన ప్రదేశాలలో అడవుల్లో విసిరియేవచ్చు. కొంతకాలానికి ఇవి మొలకెత్తుతాయి.
ఇలాగే మొలకెత్తే జండాలను తయారుచేస్తున్న మరొక సంస్థ 21fools.ఈ సంస్థను స్థాపించింది దివ్యాంశు ఎసోపా ఈ ఏడాది ఇంతవరకు 2 లక్షల జండాలను విక్రయించారు. 21fools 2014 నుంచి మొలకెత్తే జండాలను తయారుచేస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్ల లో వాళ్లరు సుమారు 40 లక్షలయూనిట్లను తయారుచేశారు.
ఈ జండాలు, గ్రీటింగ్ కార్డులు, రాఖీలలో విత్తనాలుంటాయి కాబట్టి వాటి మీద అక్షరాలు ప్రింటింగ్ మిషన్ ల తో ముద్రించడం సాధ్యంకాదు. వీటిమీద మాన్యువల్ గా అక్షరాలు ముద్రించాలి. తాము పది మాన్యువల్ ప్రింటర్స్ ను వాడుతున్నారని ఎసోపా చె ప్పారు.
మీరు చేయాల్సిందంతా ఇదే…
ఈ జండాలను, గ్రీటింగ్ కార్డులను, రాఖీలను రోడ్డు మీద గాని చెత్తబుట్టులో గానిపడేయకండి.
ఒక పూలకుండీలో కొద్ది మట్టి తీసుకోండి.
అందులో వీటిని వేసి మట్టిలో పూడ్చేసేయండి.
కొద్ది నీళ్లు పోయిండి. నాలుగయిదు రోజుల్లో ఈ జండాలలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి.