భగండేశ్వరాలయం కర్నాటక లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది కొడగు జిల్లాలో భాగమండలం దగ్గిర ఉంటుంది. ఇది కావేరి , కనికె, సుజ్యోతి నదులు కలిసే సంగమ ప్రదేశం. కేరళ టెంపుల్ అర్కిటెక్చర్ రీతిలో నిర్మించిన శివాలయం ఇక్కడ ఉంది. ఇపుడు ఈ గుడి ఇటీవల కురిసిన వర్షాల వల్ల కావేరీ వరదల్లో మునిగిపోయింది. వరదనీరు ఆలయంలోకి ప్రవేశించింది.
ఈ వరద మీద కాఫీ బోర్డు మాజీ వైఎస్ ఛెయిర్మన్ మాజీ డాక్టర్ కావేరప్ప ఇలా వ్యాఖ్యానించారు.
‘కావేరీనది అనూహ్యంగా పరవళ్లు తొక్కుతూ ఉంది. భాగండేశ్వరాలయాన్ని చుట్టు ముట్టింది. గత వందేళ్లలో ఇలా జరిగటినట్లు దాఖలా లేదు. ఇది శాస్త్రీయంగా, మతవిశ్వాసాల పరంగా,జ్యోతిషపరంగా ప్రమాదరకమయిన సంకేతం.మన అజ్ఞానం నుంచి కాపాడాలని కావేరమ్మను ప్రార్థిద్దాం,’ అని అన్నారు.
(*The life-giving Kaveri has reached beyond our imagination and surrounded the most revered “Bhagandeshwara” Temple. I think this is a rare phenomenon, in the last 100 years. Its a dangerous symptom- scientifically, religiously, spiritually, astrologically. Let’s pray Kaveramma to save us from our own ignorace.)