అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు ఇండియా కోపమొచ్చింది.
ఇండియాను ఆయన డ్రగ్స్ రవాణాలో ఒక హబ్ అని, డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రధాన దేశాలలో ఒకటని ముద్రవేశారు.
మొన్నామధ్య ఆయనకు చైనా మీద కోపమొచ్చింది. చైనా దిగుమతుల మీద తనిష్టమొచ్చినట్లు సుంకం విధించాలనుకున్నాడు. పది శాతం సుంకం ప్రకటించాడు. దీనిని దురుసు తనాన్ని చైనా తన పద్దతిలో తాను ఎదుర్కొని ట్రంప్ కు చెమటలు పట్టించింది.
చైనా కరెన్సీ యువాన్ ని డీ వాల్యు చేసి ట్రంపును వూరిరాకుండా చేసింది. దీనితో ఆయన చైనాను కరెన్సీ మానిప్యులేటర్ అని తిట్టాడు.ఇపుడేమో ఇండియాను ప్రధాన అక్రమ డ్రగ్ ప్రొడ్యూసర్ అన్నాడు.
ఈ జాబితాలో ఉన్నదేశాలు ఆఫ్గనిస్తాన్, బహామాస్, బెలిజే, బొలివియా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హెండూరాస్, ఇండియా జమైకా, లావోస్, మెక్సికో, నికరాగ్వా, పాకిస్తాన్, పనామా, పెరు, వెనెజులా.
ఈ డ్రగ్స్ దేశాల జాబితాలో భారత్ ని చేర్చడం అనేది భారత్ తీసుకుంటున్నడ్రగ్స్ వ్యతిరేక చర్యలమీద విమర్శగాని, అమెరికాకు భారత్ సహకరించడం లేదని కాదని ట్రంప్ స్పష్టం చేశారు.
2018లో అమెరికాలో డ్రగ్స్ వోవర్ డోస్ వల్ల 68,557 మంది చనిపోయారని ఆదేశనేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్సస్ ప్రకటించింది. దేశంలో ఒపియాయిడ్స్ లతో 47,590 మంది, ఫెంటానైల్, ట్రామడోల్ వంటి సింథెటిక్ ఒపియాయిడ్స్ లతో మరొక 31,557 మంది బాధపడ్తున్నారని అక్కడి మీడియా రాస్తున్నది.