[ajax_load_more post_type=”post” scroll_distance=”15″]
ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే భారతీయజనతా పార్టీతో ఉంటేనే ప్రయోజనం ఎక్కువ కాంగ్రెస్ మాజీ పెద్దపల్లి ఎంపి గడ్డం వివేకానంద గుర్తించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఢిల్లీ లో బిజెపి కండువా కప్పుకుంటారు.
ఒక టివి చానెల్, ఒక తెలుగు న్యూస్ పేపర్ కు అధిపతి అయినందున ఆయనను చేర్చుకునేందుకు బిజెపి ఉవ్విళ్లూరుతూ ఉందట.
టిఆర్ ఎస్ లో ఆయనకు సరైన గుర్తింపురాలేదు. ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్టూ రాలేదు.
దీనితో ఆయన టిఆర్ ఎస్ కు గుడ్ బౌ చెప్పారు.ముఖ్యమంత్రి కెసిఆర్ మీద అవినీతి వ్యతిరేక పోరాటమూ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఇంక కాంగ్రెస్ లో చేరతాడని అనుకున్నారు.
అయితే, రూటు మార్చుకున్నారు. న్యూఢిల్లీ అక్బర్ రోడ్డుకు కాకుండా ఐటివొ వెళ్తున్నారు.
ఇదే ప్లాన్ లో భాగంగా ఆయన బుధవారం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ నివాసానికి వివేక్ వెళ్లారు. సుమారు గంట పాటు వారిద్దరి భేటీ కొనసాగింది. అంతకుముందే ఆయన అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో వివేక్ రెండు, మూడు దఫాలు భేటీ అయ్యారని చెబుతున్నారు.
రాజ్యసభ సభ్యత్వం లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే తాను బిజెపిలోకి చేరతానని చిన్న బేరం పెట్టినట్లు తెలిసింది.
దీనికి ప్రతిగా తన తో పాటు చాలా మందిని కూడా బీజేపీలోకి తెస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు బిజెపి నేతలు చెబుతున్నారు.
ఆయన జాబితాలో కొంతమంది కాంగ్రెస్ ప్రముఖులు ఉన్నారని వూహాగానాలు వినవస్తున్నాయి.