[ajax_load_more post_type=”post” scroll_distance=”0″]
ఆన్ లైన్ రైలు టికెట్ ధర పెరగనుంది.
గతంలో రద్దు చేసిన ఇ-బుకింగ్ చార్జీలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు అనుమతి నిచ్చింది.
దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మూడేళ్ల కిందట ఐఆర్ సిటిసి ఇ- బుకింగ్ మీద ఉన్నా చార్జీలను రద్దు చేసింది. అపుడు నాన్ ఎసి టికెట్ మీద రు. 20, ఎసి టికెట్ మీద రు. 40 ఇ-బుకింగ్ చార్జ్ వసూలు చేసేవారు.
ఇపుడు అదే చార్జీలను పునరుద్ధరిస్తారా లేక కొత్త టారిఫ్ ప్రకటిస్తారా ఇంక తెలియడం లేదు. ఇ-బుకింగ్ చార్జిని రద్దు చేశాక ఇంటర్నెట్ రైల్వే టికెట్ బుకింగ్ ఆదాయం 2016-17లో 26 శాతంపడిపోయింది.