గురువారంనాడు బాగాపెరిగి ఈ రోజు రు.140 లు తగ్గి పది గ్రాముల ధర రు.38,000 పైగానే టేడయింది. అంతర్జాతీయంగా మాత్రం బంగారు ధరబలంగానే ఉన్న ఇండియాలో కొద్దిగా వూగిసలాడి పది గ్రాముల ధర రు. 38,330 నిలబడింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ ధర మాత్రం 1500 అమెరికా డాలర్లు పలికింది.
ఇక వెండి రు. 290 తగ్గింది. దీనితో కిలో ధర రు. 44,010 పలికింది. గ్లోబల్ గా స్పాట్ గోల్డ్ ధర న్యూయార్క్ లో సి ఔన్స్ 1504 డాలర్లు పలికింది.
ఇక వెండి ధర ఔన్స్ ధర 17.12 డాలర్లు పలికింది. ఆల్ ఇండియా సరఫా అసోషియేసన్ ప్రకటన ప్రకారం, దేశరాజధానిలో 99.9 శాతం ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు రు38,330, 99.5 శాతం ప్యూర్ గోల్డ్ ధర పదిగ్రాములు రు38,160, సావరిన్ గోల్డ్ 8 గ్రాములు రు.28,500 పలికాయి.
గత రెండు రోజుల్లో బంగారు ధర మొత్తంగా 1663 రుపాయలు పెరిగింది. సిల్వర్ కాయిన్ల ధర (100 కాయిన్లు) బైయింగ్ రు.88000 అమ్మకం రు. 89000 పలికాయి.