కేంద్ర మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ 67 వ ఏట కన్నుమూశారు. ఈ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నపుడు ఆమె గల్ఫ్ వర్కర్లకు ఆమె చేసిన సేవలు మర్చిపోలేనివి.
సాధారణంగా మంత్రులు తమ కార్యాలయంలో సందర్శకులను కలసి సమస్యలు వింటూంటారు. ఇది మంత్రికి సౌలభ్యంగా ఉంటుందేమో గాని, దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఇలా ఇబ్బందికరమయింది. మారుమూల ప్రాంతాలనుంచి వచ్చి మంత్రి గారిని కలసి తమ గోడు చెప్పుకోవడం సాధ్యం కాదు.
పోనీ ఒక వినతి పత్రం పంపితే అది అందుతుందున్న గ్యారంటీ లేదు.
అందుకే సుష్మాస్వరాజ్ ఖర్చు లేని ట్విట్టర్ ని తన కార్యాలయం చేసుకున్నారు.
తన శాఖ ప్రమేయంతో పరిష్కారమయ్యే విషయాలేవి వున్నా ట్వీట్ చేస్తే ఆమె స్పందించే వారు. క్షణాల్లో ట్విట్టర ద్వారా విదేశాలలో ఉండే రాయబార కార్యాలయాలకు ఉత్తర్వులు వెళ్లేవి. ఇదంతా పారదర్శకంగా జరగుతుంది, పబ్లీకున జరిగుతుంది కాబట్టి అధికారులనుంచి కూడా స్పందన చాలా వేగంగా ఉండేది.
https://trendingtelugunews.com/gold-silver-prices-explode-to-scale-up-record-high/
ఆమె ట్విట్లర్ లో అందుబాటులో ఉండటంతో గల్ఫ్ వర్కర్లకు కొండంత అండ దొరికినట్లు అయింది.
అంతవరకు వాళ్లు సమస్యల పరిష్కారానికి విదేశాంగ మంత్రి దాకా వెళ్లడమనేది జరిగేదే కాదు. ఆ ఆలోచనే వచ్చేది కాదు. అలాంటపుడు ఢిల్లీలోఉండే విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయాన్ని సార్వజనీనం చేశారు. ఎక్కడైనా తాను ప్రత్యక్షమయ్యేలా చూశారు.
ఇది కూడా చదవండి
కేంద్ర పాలిత ప్రాంతాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, రాష్ట్రాలుగా మారుతున్నాయి…
ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఉండే భారతీయ కూలీలకు ఇది వరప్రసాదమయింది. వందల వేల సంఖ్యలో గల్ఫ్ కూలీల సమస్యలను ఆమె పరిష్కరించారు.
పాస్ పోర్ట్ పోయి గల్ఫ్ లో చిక్కుక్కున్నవారిని, ఇరాక్ వంటి గల్ఫ్ యుద్ధ ప్రాంతాల్లలో చిక్కుకున్న వారిని,అక్కడ అరెస్ట్ అయిన వారిని ఎలా ఎన్నోరీతులుగా ఆమె ట్విట్టర్ ద్వారానే అదుకున్నారు. అక్కడ చనిపోయి మృతదేహాలు దిక్కు మొక్కు లేకండా పడి ఉన్నపుడు కూడా ఆమె కుటుంబాలను ఆదుుకుని దౌత్యవ్యవహారాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అందుకే ట్విట్టర్లో ఆమెకు 13.1 మిలియన్ల ఫాలోవర్లు తయారయ్యారు.
అమె మరణానికి రెండు గంటల ముందుకు కూడా ప్రధానిమోదీకి ట్వీట్ చేశారు.
प्रधान मंत्री जी – आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji – Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019
‘‘థ్యాంక్యూ ప్రైమ్ మినిస్టర్. థ్యాంకూ వెరిమచ్. నా జీవితంలో ఇలాంటి రోజు చూసేందుకేే ఎదురుచూస్తూ వచ్చాను.’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దుచేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఆమె చివరి ట్వీట్ చేశారు. సాయంకాలం ఏడున్నరకు ఆమె ఈ ట్వీట్ చేశారు. రెండు గంటల తర్వాత గుండె పోటు రావడంతో ఆమెను ఎయిమ్స్ కు చేర్చారు.
అంతకుముందు రాజ్యసభలో జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలక బిల్లులు ప్రవేశపెట్టిన హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా ఆమె ట్విటర్ ద్వారా ప్రశంసించారు.
నివాళి