తిరుమల శ్రీవారి 2019 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మొదలయ్యాయి.
సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8 తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
ఇందులో సెప్టెంబరు 30న ధ్వజారోహణం, అక్టోబరు 4న గరుడసేవ, అక్టోబరు 5న స్వర్ణరథం, అక్టోబరు 7న రథోత్సవం, అక్టోబరు 8న చక్రస్నానం జరుగుతాయి.
ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
గరుడసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
బ్రహ్మోత్సవాల తొలిరోజున ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు బహూకరిస్తారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 29న అంకురార్పణం జరుగుతాయి.
సెప్టెంబరు 14న పౌర్ణమి సందర్భంగా ప్రయోగాత్మకంగా బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహిస్తారు.
*నిన్న కొండెక్కిన బంగారు ధర ఈ రోజు ఒక మెట్టు దిగింది…
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు సెప్టెంబరు 20 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు
బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శనం, వాహనసేవలు, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులకు సేవలందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటారు.
టిటిడి విజిలెన్సు, పోలీసు అధికారులు సమన్వయం చేసుకుని భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.
ఈ విషయాలను టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి ఏర్పాట్ల మీద జరిపిన సమీక్షా సమావేశం అనతరం వెల్లడించారు.
https://trendingtelugunews.com/kashmir-conspiracy-case-nehru-sheik-abdullah-kashmir-politics/