సౌదీ మహిళలు ఇక సొంతంగా ట్రావెల్ చేయవచ్చు… కొత్త చట్టం

సౌదీ మహిళల  ప్రయాణాల మీద ఉన్న కొన్ని ఆంక్షలను ప్రభుత్వం ఎత్తి వేసింది. ఇక నుంచి సౌదీ మహిళలు పురుష సంరక్షకుడి అనుమతి లేకుండా ఎక్కడికయినా ప్రయాణం చేయవచ్చు.పాస్ పోర్టకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ మేరకు సౌదీ రాజు సాల్మన్ బిన్ అబ్దులజీజ్ ఒక ఉత్తర్వు విడుదల చేశారు. ఈ డిక్రీని నాలుగు రోజుల కిందట విడుదల చేశారు.గతంలో ప్రభుత్వం మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఎలాంటి పురుష,మహిళ అనే తారమత్య పదాలు లేకుండా సౌదీ పౌరులంతా అని సంబోధిస్తూ లింగ తటస్థ భాషలో డిక్రీని రాశారని అరబ్ న్యూస్ పేర్కొంది.
పాస్ పోర్ట్ కు దరఖాస్తుచేసుకోవడమే కాదు, పురుష సంరక్షుడి అనుమతి లేకుండా స్వేచ్ఛగా ఇక నుంచి ట్రావెల్ చేయవచ్చని ఈ డిక్రీ స్పష్టం చేసింది.
అయితే, దీనిని మైనర్లకు మినహాయించారు.
ఇది కూడా చదవండి: ఈ ఒంగోలు అమ్మాయి గురించి విన్నారా?
ఇది సౌదీ ప్రభుత్వం ఆ మధ్య విడుదల చేసిన విజన్ 2030 పర్యవసానం. మహిళల మీద ఉన్న ఆంక్షలను ఈ డాక్యుమెంట్ గుర్తించింది.
21 సంవత్సరాల పైబడిన మహిళలు తమ మానాన తాము స్వచ్ఛగా, ఎలాంటి వేధింపులు లేకుండా బతికేందుకు అడ్డొస్తున్న సాంఘిక కట్టుబాట్లను సౌదీ ప్రభుత్వం గుర్తించింది. విజన్ 2030 వీటిని తొలగించేందుకు సూచనలు చేసింది.
సౌదీ మహిళలు పెళ్లి చేసుకోవాలన్నా, పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకోవాలనుకున్నా, రెన్యూ చేసుకోవాలనుకున్నా, విదేశాలకు వెళ్లాలన్న తమ సంరక్షకుడి అనుమతి అసవరం.
ఇపుడు ఈ విషయాలన్నింటా సౌదీ మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
సౌదీ అరేబియా అమెరికా రాయబారి రీమా బందర్ ఎల్ సౌద్ ఈ సంస్కరణలను స్వాగతించింది. సౌదీ రాజు కార్మిక, పౌర  చట్టాలలో సవరణలు చేస్తూ చర్యలు తీసుకుంటారని ఇవన్నీ సౌదీ మహిళ సామాజిక హోదా పెంచేందుకే నని ఆమె ట్విట్టర్ లోపేర్కొన్నారు.

మహిళల మీద చాలా రకాల ఆంక్షలు విధించిన దేశం మొన్న మొన్నటి వరకే సౌదీ అరేబియాయే. ఇపుడు సౌదీ రాజు మొదలు పెట్టిన సంస్కరణలతో మహిళలు స్వేచ్ఛా వాతావరణంలోకి వస్తున్నారు. అపుడే ఒక మహిళ,రహ మెహర్రాక్ (25) ఎవరెస్టు ఏక్కేసింది. రఫా ఎల్ ఖామిస్ (28) దేశపు మొట్టమొదటి బాక్సర్ అయింది. ఇక  డాక్టర్ మరియామ్ ఫిర్దౌస్ వచ్చే ఏడాది సౌత్ పోల్ లో ఈత కొట్టబోతున్నది.ఇప్పటికే ఆమె నార్త్ పోల్ లో ఈత కొట్టి ప్రపపంచంలో  ఈ పని చేసిన మూడో మహిళ అయ్యారు. ఇపుడు సౌత్ పోల్లో ఈత కొడితే ఆమెనే ప్రపంచం రెండు ధృవాల సముద్రాలలో ఈత కొట్టిన తొలి మహిళ అవుతారు.