గురువారం నాడు జాతీయ రాజధాని ఢిల్లీలో బంగారు అత్యంత స్వల్పంగా పెరిగింది. అయితే,వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది.
పది గ్రాముల బంగారు ధర రు.15 పెరిగి రు. 35,795 లకు చేరింది. వెండి మాత్రం కిలో మీద ధర రు.590 తగ్గి రు. 41,530లకు చేరిందిని ఆల్ ఇండియా సరాఫా ఆసోసియేషన్ పేర్కొంది.
ఇక అంతర్జాతీయమార్కెట్ లో బంగారు ఔన్స్ ధర 1407 అమెరికన్ డాలర్ల దగ్గిర ట్రేడయింది. సిల్వర్ మాత్రం ఔన్స్ ధర 16.12 డాలర్లు పలికింది. అమెరికా డాలర్ 0.40 శాతం పెరిగింది.
అయితే, అంతర్జాతీయ బంగారు మాత్రం సెల్లింగ్ ఉధృతిలోనే ఉంది. ఎందుకంటే ముందు ముందు వడ్డీరేట్ల తగ్గింపు ఎలా ఉంటుందనే మీద అమెరికా ఫెడరల్ రిజర్వు క్లారిటీ ఇవ్వకపోవడంతో సెల్లింగ్ ట్రెండ్ కొనసాగింది.
సావరిన్ గోల్డ్ మాత్రం నిలకడగా ఎనిమిది గ్రాముల ధర రు. 27,500 దగ్గిరే ఉండిపోయింది.