తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన…

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన
ఉత్తర ఒరిస్సా, దానిని ఆనుకుని ఉన్న గాంజెటిక్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాలలో 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్ళేకొద్ది నైఋతి దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది.
దక్షిణ రాజస్థాన్ నుండి ఒరిస్సా వరకు మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్ మీదుగా 7.6 కి.మి ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
తెలంగాణ:
రాగల మూడురోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈరోజు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్ర మరియు యానాం:
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలాచోట్ల రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
రాగల మూడురోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.