విజయవాడ పోలీసు కంట్రోల్ రూం వద్ద గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం పునఃప్రతిష్ఠకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడి స్థలాన్ని ఈ రోజు మంత్రులు,సీనియర్ నాయకులు పరిశీలించారు.
విజయవాడ నగర ప్రజలు, వైఎస్ ఆర్ అభిమానుల కోరిక మేరకు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని భావిస్తున్నట్లు మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారయణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్ తెలిపారు. వారితో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేష్ తదితరుల బృందం శనివారం బందరు రోడ్డు లోని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతం, తదితర ప్రాంతాలను పరిశీలించారు.
Also Read: జైపాల్ రెడ్డి అంతిమ యాత్ర,పాడె మోస్తూ కంటతడిపెట్టిన కర్నాటక స్పీకర్
టిడిపి ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సమయంలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉందన్న సాకుతో తొలగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం తొలగించింన విషయం తెలిసిందే.
పోలీసు కంట్రోల్ రూం సమీపంలో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
విగ్రహాన్ని కంట్రోల్ రూం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద భద్రపర్చారని, దాన్ని తిరిగి తొలగించిన ప్రాంతంలోనే పునఃప్రతిష్ఠ చేయాలని ప్రజలు, అభిమానుల కోరిక మేరకు ఈ పరిశీలన చేస్తున్నామని వారు తెలిపారు.
2016 లో వైఎస్ ఆర్ విగ్రహం ఇలా కూల్చారు
వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పోలవరం ప్రాజెక్టు నమూనాతో 12 అడుగుల క్యాంస విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తూ విజయవాడ నగరపాలక సంస్థ పాలకమండలి 2010, ఏప్రిల్ 16న తీర్మానం చేసింది.
ఆర్ అండ్ బీ, పోలీసు శాఖలు అనుమతులు ఇచ్చాయి. ట్రాఫిక్‌కు ఇబ్బందులు రాకుండా కనకదుర్గమ్మ గుడికి వెళ్లే ఫ్లై ఓవర్ వద్ద ఓ మూలన 2011, సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. అనంతరం ఆ కూడలికి వైఎస్సార్ చౌక్ అనే పేరును మున్సిపల్ కార్పొరేషన్ ఖరారు చేసింది.
అయితే, 2016 జూలై 31 రాత్రి 12 గంటలకు కూల్చివేత ముహూర్తం పెట్టుకున్నారు. భారీగా పోలీసుల బలగాలతో పాటు రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది అక్కడికి వచ్చారు. కూల్చి వేత సమాచారం లీక్ కావడంతో అప్పటి వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, పార్టీ రాష్ర్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నారు.
విగ్రహం తొలగించడానికి వీల్లేదని పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్ విగ్రహం ఉన్న ఐలాండ్‌కు చేరుకొని విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు.
కౌన్సిల్ తీర్మానం చేసి, అన్ని అనుమతులతో ఏర్పాటు చేసినా రోడ్ల విస్తరణకు కాని, ట్రాఫిక్‌కు కాని ఏమాత్రం అంతరాయం కలిగించకపోయినా విగ్రహాన్ని ఎందుకు తొలగిస్తున్నారని వైసిపి నేతలు అధికారుల్ని ప్రశ్నించారు.
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వైసిపి నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టు చేశారు . ఆ తర్వత భారీ పోలీసు బందోబస్తుతో ఆరు పొక్లెయినర్లు, ఒక భారీ క్రేన్ సహయంతో తెల్లవారుజాము మూడు గంటలకు విగ్రహం తొలగించారు క్రేన్ సాయంతో విగ్రహాన్ని సమీపంలో ఉన్న ఫైర్ డీజీ కార్యాలయ పెట్టారు.
https://trendingtelugunews.com/anonymous-devottee-offers-rs-2-40-crore-to-ttd-trusgt/