‘హృదయకాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో , కాలేయం లో తన స్థానాన్ని టెంట్ వేసుకుని పడుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
హ్రుదయకాలేయం సృష్టికర్త స్టీవెన్ శంకర్ అందించిన కథ, కథనం, మాటలతో ‘కొబ్బరిమట్ట’ అనే చిత్రాన్ని తీయబోతున్నారు. ఈ రోజు రూపక్ రొనాల్డ్ సన్ ని ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం చేశారు. .. సున్నితమైన కథలతో చిత్రాలు నిర్మించి ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టే సాయి రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత. దాదాపు 3 సంవత్సరాలకు పైగా అత్యాధునికమైన సాంకేతిక నిపుణులతో నిపుణుల పర్యవేక్షణలో భారీ వ్యయం తో ఎక్కాడా కాంప్రమైజ్ కాకుండా ఎండనకా, వాననకా, చలిని సైతం తట్టుకుని ప్రేక్షకుడికి వినోదాన్ని అందించాలనే నిరంతర కృషితో కసి తో కొబ్బరి మట్ట తయావుతున్నది.
ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్రలు వేయటమే కాకుండా అత్యంత భారీ డైలాగ్లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వరల్డ్ రికార్డు ని నెలకొల్పాడు.
ఈ చిత్రం లో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్యద్బుతమైన పాత్రలు చేసి మెప్పించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం లో తెలుగు సినిమా లో వున్న నటీనటులందరూ నటించారు.
ఈ సినిమా కి సంబందించి ఇటీవల విడుదల చేసిన అఆ.. ఇఈ అనే సాంగ్ యూట్యూబ్ లో రెండు మిలియన్స్ వ్యూస్ 24 గంటల్లో రావటం ఈ చిత్రం పై సినిమా లవర్స్ కి వున్న క్రేజ్ ని తెలియజేస్తుంది. ఈ భారి చిత్రాన్ని అగష్టు 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాత భారి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయటంలో ఎక్కడా బారీయర్స్ లేని ఇంతటి క్రేజి చిత్రాన్ని నైజాం, ఓవర్సీస్ హక్కులని నొబారియర్స్ ఎంటర్టైన్మెంట్ వారు సొంతం చేసుకున్నారు. 120 నిమిషాల ఈ చిత్రం లో యాక్షన్, కామెడి, సెంటిమెంట్, రొమాన్స్, సందేశం, ఎమెషన్, లవ్ లాంటి అన్ని జోనర్స్ కలయికే ఈ కొబ్బరిమట్ట.