హరిత హారం కార్యక్రమానికి తెలంగాణ సర్కారు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇప్పటి వరకు హరిత హారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన సర్కార్ కోట్ల మొక్కలు నాటింది. వాటిని సంరక్షించే చర్యలు చేపట్టింది.
అయితే సిద్దిపేటలో హరితహారం కింద నాటిన చెట్టును కొట్టిన వ్యక్తికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది స్థానిక మున్సిపాలిటీ.
సోమవారం సిద్దిపేట నుంచి హైదరాబాద్ రోడ్డు లో కలెక్టర్ క్యాంప్ కార్యాలయo దగ్గర జీ. వీరేశం అనే వ్యక్తి హరితహారం చేట్టు ను నరికి వేశాడు. అతన్ని పట్టుకొని మందలించి 1000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది.
మళ్లీ ఒక సారి చెట్లు నరికితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి జైలు కు పంపిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.