అమరావతిని అభివృద్ధి చేసేందుకు 715 మిలియన్ డాలర్ల సాయం కావాలని గత ముఖ్యమంతి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం బ్యాంకును కోరింది.
అయితే, బ్యాంకు 300 మిలియన్ డాలర్లసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదన బ్యాంకు పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనలో ఉన్న అంశాలు: అమరావతిలో అనేక చోట్ల నగరవసతులు కల్పించాలి.
ఇపుడు అమరావతిలో దాదాపు లక్ష మంది నివసిస్తున్నారు.వీరిలో భూమిలేని వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు. అమరావతి జనాభా 2050 నాటికి 30.55 లక్షల చేరుకుంటుంది. వీళ్లకు మెరుగైన నగర వసతులు కల్పించాలి.పరిసరాల్లో ఉన్న 25 గ్రామాలను సిఆర్ డిఎలోకి తీసుకురావాలి. అపుడు భారీగా రోడ్లు అవసరమవుతాయి. వాటిని నిర్మించాలి.
అమరావతి దగ్గిర వరదనీటిని నిలువచేసేందుకు మూడు రిజర్వాయర్ లను నిర్మించాలి. కొండవీటివాగు, పాలవాగు ల నీటిని తీసుకువెళ్లే సామర్థ్యం పెంచాలి … ఇలాంటి మరిన్ని కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరింది.
అయితే,ప్రపంచ బ్యాంకు చర్చలు సాగుతున్నపుడు మాజీ కేంద్రకార్యదర్శి ఇఎఎస్ శర్మ ,రైతుసంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, మేధాపట్కర్, దేవదానం గోల్డ్ మన్ ఫ్రైజ్ అవార్డీ ప్రఫుల్ల సామంత, ఐఐసిటి రిైటర్డ్డ్ సైంటిస్టు డాక్డర్ బాబూ రావు లతో లతో కలసి దాదాపు 42 మంది నిపుణులు ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు అమరావతి ప్రాజక్టులో ఉన్న అవకతవకల మీద ఫిర్యాదు చేశారు.
ఈ అవకతవకల మీదకు బ్యాంకు దృష్టి మళ్లించారు. ఈ వివరాలు ఇక్కడ 7,8 పేజీలలో ఉన్నాయి..
పలు ఎన్జీవోలు కూడా అమరావతి పేరుతో సాగుతున్న ‘విధ్వంసం’ మీద ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదుచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అమరావతి నిర్మాణం పర్యావరణ నియమాలను ఉల్లంఘించి చేపడుతున్నారని, ఇక్కడి వ్యవసాయభూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కున్నారని, దీనితో భవిష్యత్తులో ఆహారఅభద్రత ఏర్పడుతుందని వారు బ్యాంకు దృష్టికి తీసుకువచ్చారు.
ఇదే విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్నకేసుల గురించి,తీర్పుల గురించి కూడా బ్యాంకు తెలియచేశారు.
దాదాపు ఇదే కారణాలతోనే కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అమరావతినిర్మాణం ప్రాధన్యాతను తగ్గించింది. ఈ ప్రభుత్వం రాజధానిని కేవలం 7 లేదా 8 వేల ఎకరాల కోర్ క్యాపిటల్ ఏరియాకు పరిమితం చేసే విషయం కూడా ఆలోచిస్తూ ఉంది.
ఈ నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ప్రాజక్టునుంచి డ్రాప్ అయినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఫిర్యాదులు అందాక ప్రపంచ బ్యాంకు పరిశీలకులు అమరావతిసందర్శించి అక్కడ అధికారులతో, ప్రాజెక్టు బాధితుల (Projec Affected People) తో చర్చించారు.
ఆపైన ప్రాజక్టు ప్రతిపాదనలను పెండింగులో పెట్టారు. అయితే, 2018 జూలై చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సవరించిన ప్రతిపాదనలతో మరొక నివేదిక సమర్పించింది.
అంతేకాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అమరావతి డెవెలప్ మెంటు ప్రాజక్టుకు అనుమతి వచ్చిందని పేర్కొంది.
దీనితో ఇక నిధులు విడుదలవుతాయని అనుకుంటున్నపుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రయారిటీలు మారిపోయాయి.
ఇక ప్రాజక్టు అమలుచేయడం కష్టమని బ్యాంకు భావించినట్లుంది, Amaravati Sustainable Infrastructure and Institutional Development Project నుంచి డ్రాప్ అయింది.
ప్రపంచ బ్యాంకు వెట్ సైట్ లో కేవలం డాప్డ్ (dropped) అని మాత్రమే ఉంది. వివరాలు లేవు.
ప్రపంచ బ్యాంకు ఈ నిర్ణయానికి రావడాన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ వర్కింగ్ గ్రూప్ స్వాగతించింది.
ఈ వర్కింగ్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, అనేక ప్రజాసంఘాల విజ్ఞప్తులను, ఎన్జీవోల ఫిర్యాదులను పరిశీలించాక ప్రాజక్టు నుంచి డ్రాప్ అవ్వాలనే నిర్ణయానికి ప్రపంచ బ్యాంకు వచ్చింది,’అని పేర్కొంది.
అమరావతి రాజధాని నిర్మాణంలో అనేక నియమాల ఉల్లంఘలున్నాయని ప్రపంచం బ్యాంకు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రాజక్టు అనేక మంది ప్రజల మనుగడకు సున్నితమయిన పర్యావరణానికి ముప్పు తెస్తున్నది. నర్మద, టాటా ముంద్రా తర్వాత ప్రపంచ బ్యాంకు డ్రాప్ అయిన మూడో పెద్దప్రాజక్టు ఇదే… అని ఈ ప్రటనలో పేర్కొన్నారు.
We are happy that World Bank took cognizance of the gross violations involved in the Amravati Capital City project, threatening the livelihood of people and fragile environment. After Narmada and Tata Mundra, this the third major victory against the World Bank Group : Working Group on International Financial Institutions