ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల నియోజకవర్గానికి ప్రతిలోక్ సభలో ఒక సభ్యుడుంటారు. అయినాసరే, ఎపుడూ నంద్యాల పేరు వినిపించేది కాదు. ఈ సారి దీనికి భిన్నంగా కొత్త ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి మొదటి సభనుంచి నంద్యాల వాణిని, రాయలసీమ వాణిని వినిపించడం మొదలుపెట్టారు.
మొన్న లోక్ సభలో మాట్లాడుతూ రాయలసీమ సమస్యలను ప్రస్తావించారు. వాటికోసం పోరాడుతూ ఉంటానని చెప్పారు.
ఈ రోజు ఆయన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ని కలసి నంద్యాలకు సంబంధించిన పలు ముఖ్యమయిన సమస్యలను ప్రస్తావించారు.
రాష్ట్రాలు విడిపోయినా, కర్నూలు జిల్లాకు హైదరాబాద్ కు విడదీయరాని సంబంధం ఉంటుంది. జిల్లాలో కీలకమయిన పట్టణం నంద్యాల.నంద్యాల లో రైల్వే స్టేషన్ ఉంది. నిజానికి నంద్యాలకు జరగాల్సిన న్యాయం జరగడమే లేదు. ఇది రైల్వేకు వర్తిస్తుంది. రైలు మార్గం ఉండి కూడా హైదరాాబాద్ తో పెద్దగా సంబంధం లేని పట్టణం నంద్యాల.
అందువల్ల సికింద్రాబాద్ నుండి కర్నూలు కు ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్సీ టి రైలు ను నంద్యాల వరకు పోడగించాలని పోచా బ్రహ్మానందరెడ్డి రైల్వే మంత్రిని కోరారు. ఈ మేరకు మంత్రికి ఆయన ఒక వినతిపత్రం కూడా సమర్పించారు.
బ్రహ్మానందరెడ్డి లేవనెత్తిన మరిన్ని అంశాలు:
1) తమిళనాడు అరకోణం నుండి కడపకు ప్రస్తుతం నడుస్తున్న రైలును నంద్యాల కు పోడగించాలని…
2) నంద్యాల నుండి గుంటూరు వరకు నూతనంగా #ఇంటర్_సిటీ రైలును నడపాలని…
3) గుంటూరు – తిరుపతి కి వయా నంద్యా ఒక రైలు నడపాలి
4) గుంటూరు నుండి విశాఖపట్నం వరకు వెలుతున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ను నంద్యాల- విశాఖ ఎక్స్ ప్రెస్ గా మార్చాలి. అంటే నంద్యాల నుంచి ప్రారంభించాలి. అలాగే అదే రైలు తిరిగి విశాఖపట్నం నుండి నంద్యాల వరకు వచ్చే విధంగా చేయాలి.
6) ప్రస్తుత గాజులపల్లె రైల్వే స్టేషన్ పేరును మహనంది స్టేషన్ గా మార్చాలి.
7) నంద్యాల పాలకేంద్రం నుండి చిన్నచెరువుకట్టకు బైపాస్ రోడ్డు వేయుటకు మధ్యలో రైల్వే ట్రాక్ అడ్డొస్తున్నది. దీని పరిష్కారానికి రైల్వే శాఖ పరిమిషన్ కావాలి. వెంటనే మంజూరు చేయాలి.
8)నంద్యాల గాంధీచౌక్ లో పెద్దపోస్ట్ఆఫీస్ లో నంద్యాల ప్రజల అవసరార్ధం బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని.
ఇవన్నీ భారీ డిమాండ్లు కాదు. పెద్ద ఆర్థిక భారం మోపే డిమాండ్లు కూడా కాదు.వీటిని పరిష్కరించేందుకు పెద్దగా విధాన పరమయిన నిర్ణయాలు అవసరం లేదు.అయినా సరే రైల్వే శాఖ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధుపట్టించుకోలేదు.బ్రహ్మానంద రెడ్డి వత్తిడి ఫలించి ఈ కోర్కెలు వచ్చే బడ్జెట్ నాటికి నెరవేరితే,నంద్యాల బాగపడే మార్గం ఏర్పడుతుంది.