దేశరాజధాని ఢిల్లీలో బంగారు ధర పది గ్రాములకు రు. 170 పెరిగి రు. 35,670కి చేరుకుంది. వెండి,ఏకంగా రు.910 పెరిగి కిలో ధర రు.41,100 కు చేరింది.
అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉండటం, ఇండస్ట్రియల్ యూనిట్స్, కాయిన్ మేకర్స్ బాగా కొనుగోళ్లు చేయడంతో ఈ ధరలు పెరిగాయని ఆల్ ఇండియాసరాఫా అసోసియేషన్ తెలిపింది.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 1422 డాలర్లు పలికింది. వెండి ధర ఔన్స్ 16.17 డాలర్లు పలికింది. ఇంక మన జాతీయ రాజధానిలో 99.9 శాతం ప్యూర్ గోల్డ్ ధర పదిగ్రాములు రు. 35,670 లుంటే, 99.5 శాతం ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములురు. 35,500 లు పలికింది.
ఇక సావరిన్ గోల్డ్ మాత్రం ఎనిమిది గ్రాముల ధర రు.27,400 గా ఉంది. నిన్న బంగారు ధర రు. 70 తగ్గింది. వెండి రు.600 పెరిగింది.