ప్రాఫిట్ బుకింగ్ వల్లా,అంతర్జాతీయ ట్రెండ్ అనుకూలంగా లేకపోవడం వల్ల పది గ్రాముల బంగారం ధర రు. 100 తగ్గి రు. 35,470కి దిగింది.
వెండికూడా బంగారు బాటనే పట్టింది. కిలో రు25 తగ్గి, రు. 39,175లకు పడిపోయింది. ఇండస్ట్రియల్ యూనిట్స్ నుంచి, కాయిన్ మేకర్స్ నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతో వెండి ధర తగ్గింది.
శనివారం నాడు గోల్డ్ ధర రు.175 పెరిగి పది గ్రాముల ధర రు.35,570కి చేరుకుంది. సిల్వర్ కూడా రు. 175 పెరిగి కిలో ధర రు.39,700 లకు చేరింది.
ప్రాపిట్ బుకింగ్ వల్ల గోల్డ్ ధర పడిపోయిందన్నపుడు… ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏమిటో తెలుసా?
ఇదొక స్టాక్ మార్కెట్ పారిభాషిక పదం. మీరు ఏదైనా కంపెనీ స్టాక్ కొంటారు. వచ్చే ఆరునెలల్లో దీని ధర 30 శాతం పెరుగుతుందని అంచనా వేసి ఈ స్టాక్ కొంటారు. తర్వాత ఇదే ఉద్దేశంతో మరికొందరు ఇదే స్టాక్ కొంటారు. దీనితో ఆ స్టాక్ ధర పెరుగుతుంది. పెరుగుతూ పెరుగుతూ ఈ ధర దాదాపు 40 శాతం పెరిగిందని మీకు తెలుస్తుంది. ఈ విషయం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనితో ఇక ఈ స్టాక్ ను లాభానికి అమ్మేయాలని చూస్తారు.
ఇలా ఈ స్టాక్ ను అంత లాభానికి వదిలించుకోవాలని చూస్తారు, అమ్మేస్తారు. దీనితోస్టాక్ ధర మళ్లీ పడిపోతుంది. ఇదేప్రాఫిటు బుకింగ్ అంటే…