ఈ రోజు ఉన్నట్లుండి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ధర 930 రుపాయలు పెరిగి రు. 35,800 లకు పెరిగింది.
దీనికి కారణం, అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించబోతుండటమే. అమెరికా ఫెడరల్ రిజర్వు చెయిర్మన్ జెరోం పావెల్ ఈ మేరకు సూచన ప్రాయంగా ప్రకటనచేయగానే ఇన్వెస్టర్లు బంగారు లో వెచ్చించడం మొదలుపెట్టారు.
ఇది ఇండియా బంగారు ధరలను కూడాప్రభావితం చేసింది. ఇక వెండికి సంబంధించి, కెజి ధర రు. 300 పెరిగింది. ఇపుడు వెండి మార్కెట్ లో కేజి ధర రు. 39,200 పలుకుతూ ఉంది. ఇండస్ట్రియల్ యూనిట్లు, నాణేల తయారీ దారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో వెండి ధర వూపందుకుంది.
అమెరికా వడ్డీరేట్లు తగ్గిస్తామనగానే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బంగారు వైపు మళ్లిందని, ఇదే విధంగా అమెరికా-చైనా ట్రేడ్ వార్ సడలే సూచనలు కనిపించకపోవడం కూడా బంగారు ధర పెరిగేందుకు కారణమని మార్కెట్ పండితులు చెబుతున్నారు.
ఆల్ ఇండియా సరాఫ అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం 99.9 శాతం, రు. 930 పెరిగి రు. 35,800 చేరితే 99.5 శాతం ప్యూర్ గోల్డ్ రు.35,630 కి చేరుకుంది.