ఇది యమటేస్టు గురూ, ల్యాబ్ లో చికెన్ సృష్టించిన తెలుగు కార్డియాలజిస్టు
ఉమా వాలేటి వృత్తిరీత్యా కార్డియాలజిస్టు. విజయవాడలో పుట్టి పెరిగాడు. పుదుచ్చేరి జిప్ మెర్(JIPMER)లో మెడిసిన్ చేశాడు. తర్వాత అమెరికా వెళ్లాడు. ఇదే మంత పెద్ద విషయం కాదు.
కార్డియాలజీలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. తర్వాత కార్డియో గుండె సంబంధమయన జబ్బుల మీద పరిశోధన చేసేందుకు ఆయనకు మయో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫెలో షిప్ వచ్చింది. ఇదీ కూడా అంత విశేషమేమీకాదు, ఈ రోజుల్లో
తర్వాత యూనివర్శటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ సెంటర్ లో పనిచేస్తున్నారు. కార్డియాలజిస్టుగా ఆయన దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా మందిచేస్తుంటారు.
మరయితే ఉమ విశేషమేమిటి?
ఈ మధ్య మెంఫిస్ మీట్స్ (Memphis Meats) అనే స్టార్టప్ ప్రారంభించారు. ఆ సంస్థకు ఉజ్వలమయిన భవిష్యత్తు ఉందని ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు బిల్స్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్, జాక్ వెల్స్, కార్గిల్ (కంపెనీ), టైసన్ వంటి అగ్రశ్రేణి బిలియనీర్లు క్యూకట్టారు. ఇదీ సంగతి.
దీనికి కారణం, ఉమ చదివేందేమో కార్డియాలజీ. ప్రారంభించిందేమో మాంసం బిజినెస్. ఈ మామూలు మాంసంకాదు, ‘మెంఫిస్ మీట్స్’ అనే ఈ స్టార్టప్ తొందర్లో ల్యాబ్ నుంచి తయారుయ్యే మాంసంతో ప్రపంచంలో విప్లవం తీసుకొస్తూండటమే.
2015 లో మెంఫిల్ మీట్స్ ఇద్దరితో ప్రారంభమయింది. 2021 నాటికి ఇది ఒక కొత్త ప్రాడక్టు ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతూ ఉంది. అదేందంటే… మనిషి చరిత్రలో మొట్టమొదటి సారిగా సొంతంగా ‘సృష్టించిన’ మాంసం.
(ఈ స్టోరీ నచ్చితే అందరికీ షేర్ చేయండి. trendingtelugunews.comను ఫాలోకండి)
ఇది ఆహార చరిత్రలో ఇది విప్లవం కాబోతున్నది. జంతువును చంపకుండానే అదే జంతువు మాంసాన్ని లాబోరేటరీలో తయారు చేయడం.ఈ టెక్నిక్ కనిపెట్టాడు ఉమ. ఈప్రయోగం విజయవంతమయింది.
ఇపుడు కమర్షియల్ స్థాయిలో ల్యాబోరేటరీ మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చికెన్ , బాతు మంసాన్ని మొదట తయారుచేయాలనుకుంటున్నారు. ఎందుకంటే చైనాలో బాతు మాంసానికి విపరీతమయిన మార్కెట్ ఉంది.
ఇలా భూమ్మీద ఎన్నిరకలా మాంసం మనుషి ఇష్టపడతాడో వాటన్నింటిని వీళ్లుతయారుచేసి మార్కెట్లో విడుదల చేయాలనుకుంటున్నారు మెంఫిస్ మీట్స్ వాళ్లు. ఈ కంపెనీకి ఉమ సిఇఒ ప్లస్ చీఫ్ విజనరీ.
ఈ పద్ధతిలో స్టెమ్ సెల్స్ ద్వారా మాంసాన్ని ల్యాబ్ లో తయారుచేస్తారు. చికెన్, మటన్, డక్, బీప్, ఫిష్ ఇలా ఏ మాంసాన్నైనా ఆ జంతువును ముట్టుకోకుండా, చంపకుండా అదే మాంసాన్ని, అదే రంగు రుచి వాసనతో తయారుచేస్తారు.
ఈ ప్రయోగం విజయవంతంంకావడంతో, ఇది మనిషి ఆహారం చరిత్రలో మరొక కొత్త విప్లవమని బిల్ గ్రేట్స్, బ్రాన్సన్ కనిపెట్టారు. అందుకే మెంపిస్ మీట్స్ లో పెట్టుబడులు పెట్టుందుకు క్యూలో నిలబడ్డారు. బహుశా ప్రపంచ ధనవంతులను క్యూలో నిలబెటించుకున్న స్టార్టప్ తెలుగువాడి మెంఫిస్ మీట్సేనేమో.
అయితే, మెంఫిస్ మీట్స్ లో తొలిసారి $17 మిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు అదృష్టం లభించింది స్టీవ్ జువెర్ట్ సన్ అనే ఒకే ఒక వెంచర్ క్యాపిటలిస్టుకు.
ఉమకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే…
కార్డియాలజీ లో రీసెర్స్ చేసేందుకు 2005లో ఉమకు మయో క్లినిక్ లో ఫెలో షిప్ వచ్చింది. కార్డియాక్ అరెస్టు వల్ల దెబ్బతిన్న గుండె కండరాలను స్టెమ్ సెల్స్ ద్వారా రిపేర్ చేసే దాని మీద ఆయన పరిశోధన చేస్తున్నారు. స్టెమ్ సెల్ అనేవి మన శీరరంలో నుంచి సేకరించిన కణ జాలమే. అయితే, ఇవి పెరిగితే, ఏ శరీరావయవం నుంచి వీటిని సేకరించామో అలాంటి కణజాలంగా తయారవుతాయి.
గుండెలో దెబ్బతిన్న కండరాల స్థానంలోకి స్టెమ్ సెల్స్ ప్రవేశపెడితే, అవి అలాంటి కండరాలనే సృష్టిస్తాయి.గుండెకు పటుత్వాన్నిస్థాయి.అపుడు పనికిమాలిన కండరాలను తీసేయవచ్చు. ఇదొక విధంగా పునర్జన్మనే. ఇలా స్టెమ్ సెల్స్ తో కొత్త గుండె కండరాలను పునఃసృష్టిస్తున్నపుడు,ఇదే పద్దతినుపయోగించి మనకు కావలసిన మాంసాన్ని ఎందుకు సృష్టించుకోకూడదనే ఆలోచన ఉమకు వచ్చింది. అంతే దాని గురించి ప్రయోగం మొదలు పెట్టారు.
మనిషి పరిణామంలో వ్యవసాయం ద్వారా ఆహారం పండించడం కనుగొనడాన్ని ఒక విప్లవాత్మకమయిన మార్పుగా చెబుతారు. ఎందుకంటే, వ్యవసాయంతో మనిషి ఆహారపుటలవాట్లు, సంఘ జీవితం పూర్తిగా మారిపోయాయి. వ్యవసాయం (Neolithic revolution) ఇప్పటికి 10 నుంచి 15 వేల సంవత్సరాల కిందట మొదలయింది. ఆ తర్వాత మరొక ఆహార విప్లవం ఇపుడొస్తున్న ఆహార సృష్టియే కావచ్చు.అపుడు పెరుగుతున్న జనాభాకుతగ్గట్టు ఆహారాన్ని ‘పండించడం’ నేర్చుకున్నారు. ఇపుడు పెరిగిపోతున్నడిమాండ్ కుతగ్గట్టుగా ఆహారం ‘సృష్టించడం’ మొదలవబోతున్నది.
మామూలుగా కోళ్లను, మేకలను, బాతులను సేకరించి పెంచి, పోషించి, మాంసం కోసం వాటిని చివరకు చంపాల్సి వుంటుంది. ఇందులో భారీ ఖర్చు ఉంది. హింస వుంది. పర్యావరణ నష్టం ఉంది.
ఉమ ప్రయోగం వల్ల కేవలం కొన్ని కణాలను జంతువును సేకరించి వాటితో మాంసం సృష్టించవ్చు. అంటే జంతువుకు ఎలాంటి హానీ ఉండదు.అదెక్కడో పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ల్యాబ్ లో దాని మాంసం పెరుగుతూ ఉటుంది సహజంగానూ ఉంటుంది. శుభ్రంగాను ఉంటుంది.
ఈ పద్దతి వల్ల పర్యావరణ వాదులు, జీవకారుణ్య వాదులు హ్యాపీయే. మరొక వైపు మాంసప్రియులంతా హ్యాపీ. ఎందుకంటే ఎవరికి ఏ జంతువు మాంసంకావాలన్న తయారుచేయవచ్చు. అంతరించిపోతున్న జంతువులను వేటాడే ప్రశ్నే ఉండదు. కావాలంటే వూరికే, పెంచుకోవచ్చు. అంటే కొత్తరకం డొమెస్టికేషన్ (జంతువులను సాకడం) మొదలవుతుంది.
ఉమ ముందుకు వచ్చిన చిక్కు ప్రశ్న
ఈ ప్రయోగం కోసం ఉమ ముందు ఒక సవాల్ నిలబడింది. కార్డియాలజీస్టుగా ఉద్యోగం చేయాలా? లేక మాంసం విక్రేతగా మారాలా?
‘కార్డియాలజిస్టుగా ఉంటే వచ్చే ముప్పై యేళ్లలో మహా అంటే రెండు మూడువేల మంది ప్రాణాలను కాపాడవచ్చు. అదే ఆహారం మీద దృష్టిపెడితే.. బిలియన్ల ప్రజలను ఆకలి నుంచి కాపాడవచ్చు, ట్రిలియన్ల జంతువులను కాపాడవచ్చు,’ అనే నిర్ణయానికి ఉమ వచ్చాడు.
ఈ ఆలోచన 2014లో ఒక మిత్రుడి నుంచి మద్దతు లభించింది. ఆయన ఉమను సెల్ బయాలజిస్టు నికోలస్ జినోవీస్ కు పరిచయం చేశారు.
ఇద్దరు కలసి 2015 సెప్టెంబర్ లో అవు కండరాలను,కనెక్టివ్ టిష్యూను సృష్టించే ప్రయోగం మొదలుపెట్టారు.
2016 జనవరి కల్లా వాళ్ల ప్రయోగం విజయవంతమయింది. ఒక మాంసం ముద్ద తయారయింది (గ్యాలరీలో మీట్ బాల్ చూడవచ్చు). దాన్ని రుచిచూసినపుడు తొట్టతొలీత మాంసం తిన్న రుచే గుర్తుకువచ్చిందిని ఉమ చెప్పారు.
జంతువును చంపి సేకరించిన మాంసానికి, దీనికి తేడాలేకపోవడం గమనించారు. అదే రుచి మెంఫిస్ మీట్ కు కూడా వచ్చేందుకు వీరు అనేక రకాల స్టెమ్ సెల్స్ ను కలిపి ప్రయోగాలు చేశారు.
ఆ తర్వాత తాము సృష్టించిన మాంసపు రుచిని బయటి వాళ్లకు చూపించాలనుకున్నారు. ఒక రోజు 25 మంది అతిథులను ఆహ్వానించారు. ఫ్రైడ్ చికెన్ తోపాటు ఫ్రెంచ్ బాతు ఫ్రై (à l’orange) వడ్డించారు. అందరూ ‘అదుర్స్’ అనేశారు.
మరొక 20 సంవత్సరాలలో మనుషులు ఈ మాంసానికి అలవాటు పడిపోయి, మాంసం కోసం కోళ్లను, బాతులను, మేకలను చంపేవారన్న మాట విని ఆశ్చర్యర్యపోతారని ఆయన అంటున్నారు.
ఈ రంగంలో చాలా మంది ప్రయోగాలు చేస్తున్నా, ఫలితాల్లో వాళ్లెవరూ మెంఫిస్ దరిదాపుల్లో లేరు. అందుకే ఉమ ప్రారంభించిన మెంఫిస్ పరిశోధనలోను, మార్కెట్ లో లీడర్ అయ్యే అవకాశం ఉంది.
దీనివల్లే బిల్ గేట్స్, బ్రాన్స్ న్ వంటి వాళ్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. నిజానికి రిచర్డ్ బ్రాన్సన్ మాంసంలో ఉన్న జంతు హింసకారణంగా బీఫ్ తినడం ఎపుడో మానేశారు. ఆయనకు తనలాంటి వాళ్లకు పరిష్కారం మెంఫిస్ మీట్స్ లో ఉందని అనిపించింది.
(ఫోటోలు Memphis Meats facebook నుంచి)